Pushpa 2 Movie Release Date : 'పుష్ప 2' రిలీజ్ డేట్‌పై మొత్తానికి ఓ క్లారిటీ వచ్చేసింది. 2024 ఆగస్టు 15వ తేదీన సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసేశారు. అయితే ఈ డేట్‌ను సినిమా విడుదల చేయడం బాగానే ఉంది. పబ్లిక్ హాలీడే కావడం వల్ల లాంగ్ వీకెండ్ కలిసొస్తుంది. కానీ ఈ డేట్.. వెయ్యి కోట్ల మార్కెట్‌ను అందుకుంటుందా అనేది కాస్త అనుమానంగానే ఉంది.
ఎందుకంటే?
Pushpa 2 VS Indian Movie : ఈ చిత్రం ఆగస్ట్ 15న గురువారం రిలీజ్ చేస్తున్నారు. అంటే మొదటి వీకెండ్లో నాలుగు రోజులతో మంచి వసూళ్లు వస్తాయి. ఇక రెండో వీకెండ్ వచ్చేసరికి రాఖీ పండుగ, ఆ తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో వినాయక చవితి ఇలా సినిమాకు మంచి హాలిడేస్ దొరికాయి. కానీ ఇదే సమయంలో కోలీవుడ్‌లో దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 సినిమా కూడా రిలీజయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది శంకర్. విక్రమ్‌తో బ్లాక బస్టర్ హిట్ అందుకున్న యూనివర్స్ స్టార్ కమల్ హాసన్. దీంతో సౌత్ ఇండస్ట్రీలో పుష్ప 2కు గట్టి పోటీ ఎదురయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి.