తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సుక్కు భారీ స్కెచ్​.. 'అవతార 2' సినిమాలో 'పుష్ప 2' గ్లింప్స్! - పుష్ఫ సినిమా బడ్దెట్​

ఐకాన్​స్టార్ అల్లుఅర్జున్​ నటించనున్న 'పుష్ప 2' గురించి అదిరిపోయే అప్డేట్​ బయటకు వచ్చింది. ఈ చిత్రం గ్లింప్స్​ను రిలీజ్​ చేసేందుకు మేకర్స్​ సన్నాహాలు చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్​ కానున్న 'అవతార్​ 2' సినిమాలో ఈ స్పెషల్ గ్లింప్స్​ను విడుదల చేస్తారు.

అవతార 2 సినిమాలో పుష్ప 2
pushpa 2 movie shooting update

By

Published : Nov 12, 2022, 12:11 PM IST

'పుష్ప' చిత్రంతో జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ ఆదరణ దక్కించుకున్నారు కథానాయకుడు అల్లు అర్జున్‌. ఈ నేపథ్యంలోనే ఇప్పుడాయన నుంచి రానున్న 'పుష్ప 2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ అంచనాల్ని దృష్టిలో పెట్టుకునే రెండో భాగాన్ని అత్యున్నత సాంకేతిక హంగులతో ముస్తాబు చేసే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం.

అంతేకాదు చిత్రీకరణ దశ నుంచే ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే వచ్చే నెలలో 'పుష్ప 2'కు సంబంధించిన చిన్న వీడియో గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రచార చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే అల్లు అర్జున్‌పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో అల్లు అర్జున్‌ లేని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది.

డిసెంబరు 16న విడుదల కానున్న 'అవతార్‌ 2' సినిమాతో పాటే ఈ చిత్ర గ్లింప్స్‌ను బయటకు వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రచార చిత్రాన్ని భారతీయ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ద్వారానే చిత్ర విడుదల తేదీపైనా స్పష్టత ఇవ్వనున్నారని సమాచారం. సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక కథానాయిక.

ఇదీ చదవండి:ఆ ఔట్​ఫిట్​లో ర్యాంప్​ వాక్​తో అదరగొట్టిన బాలీవుడ్​ తారలు

కథ కుదిరే.. కలయిక అదిరే.. కొత్త సినిమాలతో టాలీవుడ్​ హీరోల హంగామా

ABOUT THE AUTHOR

...view details