తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'పుష్ప 2' స్క్రిప్ట్​లో​ మార్పులు.. చిత్ర నిర్మాత​ ఏమన్నారంటే? - పుష్ప 2 మూవీ వర్సెస్​ కేజీఎఫ్ 2

Pushpa 2 script changes: 'కేజీయఫ్​ 2' భారీ విజయం సాధించడం వల్ల.. దాని ప్రభావం 'పుష్ప 2'పై పడొచ్చని వార్తలు వచ్చాయి. దీంతో రెండో భాగం స్క్రిప్ట్​లో దర్శకుడు సుకుమార్​ మార్పులు చేస్తున్నారని ప్రచారం సాగింది. అయితే తాజాగా దీనిపై స్పందించారు చిత్ర నిర్మాత వై రవిశంకర్​. ఆయన ఏమన్నారంటే..

pushpa 2 movie script changes
పుష్ప 2 స్క్పిప్ట్​లో మార్పులు

By

Published : May 3, 2022, 9:26 AM IST

Updated : May 3, 2022, 9:36 AM IST

Pushpa 2 script changes: కన్నడ రాకింగ్ స్టార్ యశ్​ నటించిన 'కేజీయఫ్​ 2' ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్​ సినిమా రికార్డులను తిరగరాసింది. దీంతో రాబోయే సీక్వెల్​పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో 'పుష్ప 2' మూవీ ఆ అంచనాలు అందుకోవడానికి డైరెక్టర్‌ సుకుమార్‌ స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నారని జోరుగా ప్రచారం సాగింది. పుష్పరాజ్‌ పాత్రను మరింత ఎలివేట్‌ చేసేలా కథ, కథనాలు ఉండబోతున్నాయని వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై ప్రొడ్యూసర్‌ వై రవిశంకర్‌ స్పందించారు. స్క్రిప్ట్​లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు.

"అలాంటిదేమీ లేదు. 'కేజీయఫ్​ 2' మూవీ మా 'పుష్ప 2'ను ఎలా ప్రభావితం చేస్తుంది? మార్పులేమీ లేవు. ఇప్పటికే మా దగ్గర హైఓల్టేజ్‌ స్క్రిప్ట్‌ సిద్ధంగా ఉంది. ఆ స్క్రిప్ట్‌నే సుకుమార్‌ అందంగా ప్రెజెంట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. లొకేషన్ల కోసం కొన్ని రోజులుగా తిరుగుతున్నాం. తొలి భాగం చిత్రీకరించిన అడవిలోనే దీన్ని కూడా తెరకెక్కిస్తాం" అని రవిశంకర్‌ చెప్పారు.

కాగా, తొలి భాగంలో ఒక సాధారణ కూలీగా జీవితం మొదలు పెట్టిన పుష్పరాజ్‌ ఎర్రచందనం స్మగ్లింగ్‌ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదగాడన్నది అదిరిపోయేలా చూపించారు దర్శకుడు సుకుమార్‌. చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండానే వదిలేశారు‌. దీంతో మలి భాగంలో ఏం చూపించబోతున్నారా? అన్న ఆసక్తి అభిమానుల్లో విపరీతంగా ఉంది.

ఇదీ చూడండి: 'కేజీయఫ్‌ 2'ఎఫెక్ట్‌ 'పుష్ప 2'పై పడుతుందా?

Last Updated : May 3, 2022, 9:36 AM IST

ABOUT THE AUTHOR

...view details