తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Pushpa 2 Gamechanger : 'పుష్ప 2' - 'గేమ్ ఛేంజర్'.. ఇక అప్పుడు కూడా డౌటే! - ramcharan Gamechanger release date

Pushpa 2 Gamechanger Movie Release Dates : 'పుష్ప 2' - 'గేమ్ ఛేంజర్' విడుదల తేదీపై తాజాగా ఓ సమాచారం అందింది. ఆ వివరాలు..

Pushpa 2 Gamechanger : 'పుష్ప 2' - 'గేమ్ ఛేంజర్'.. ఇక అప్పుడు కూడా డౌటే!
Pushpa 2 Gamechanger : 'పుష్ప 2' - 'గేమ్ ఛేంజర్'.. ఇక అప్పుడు కూడా డౌటే!

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 10:30 PM IST

Pushpa 2 Gamechanger Movie Release Dates : టాలీవుడ్ మోస్ట్​ అవైటెడ్​ సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ అవన్నీ వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఒక్క సలార్​ మాత్రం ఈ ఏడాది చివర్లో వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే అది కూడా వచ్చే ఏడాదే 2024 వస్తుంది. అలా వచ్చే ఏడాది.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్​, యంగ్ టైగర్ ఎన్టీఆర్​, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్​ ఇలా చాలా మంది స్టార్ హీరోల సినిమాలు రాబోతున్నాయి.

Pushpa 2 Release Date : కానీ వీటిలో అల్లు అర్జున్ పుష్ప 2, రామ్​ చరణ్​ గేమ్​ ఛేంజర్ విడుదల తేదీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ రెండు సినిమాలు.. వచ్చే ఏడాది సమ్మర్​కు విడుదలయ్యే ఛాన్స్ ఉందని మొన్నటి వరకు గట్టిగానే ప్రచారం సాగింది. కానీ ఇప్పుడా పరిస్థితి అస్సలు కనపడట్లేదు. పుష్ప 2ను వేసవి కన్నా ముందే మార్చి చివర్లో విడుదల చేయాలని మేకర్స్ ట్రై చేస్తున్నారట.

కానీ ఈ సినిమా షెడ్యూల్స్​ చూస్తుంటే కాస్త ఆలస్యంగా అవుతున్నట్లు సమాచారం అందుతోంది. మొదటి భాగానికి విశేష ఆదరణ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సెకండ్ పార్ట్ కోసం దర్శకుడు సుకుమార్​ మరింత జాగ్రత్తగా భారీగా ప్లాన్ చేసి మరీ తెరకెక్కిస్తున్నారట. ఎక్కడా రాజీపడకుండా షూట్ చేస్తున్నారట. ఇప్పటివరకు 1/3 షూటింగ్​ జరిగిందని అంటున్నారు. అంటే మిగతా భాగం కంప్లీట్ అవ్వడానికి మరింత సమయం పడుతుంది. ఒకవేళ ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి పూర్తి కాకపోయినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Gamechanger Release Date : ఇక గేమ్​ ఛేంజర్ విషయానికొస్తే.. ఈ సినిమా విడుదల తేదీతో పాటు షూటింగ్ విషయమై కూడా చాలా సస్పెన్స్​ నెలకొంది. ఈ సినిమాను కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ డైరెక్టర్​ ఈ సినిమాతో పాటు కమల్​ హాసన్​తో ఇండియన్ 2 కూడా చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల చేయాలని అనుకుంటున్నారట. దీని తర్వాతే గేమ్​ ఛేంజర్​ను ఆడియెన్స్​ ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంటే ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Alluarjun Latest Insta Post : ఫ్యాన్స్​కు బన్నీ బిగ్​ సర్​ప్రైజ్​.. 'పుష్ప 2' స్పెషల్ వీడియోతో

Pushpa 2 Release Date : నేషనల్ అవార్డు విన్నింగ్ జోష్​లో బన్నీ.. పుష్ప-2 రిలీజ్ ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details