తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఈ ఒక్క డైలాగ్ చాలు!.. బాక్సాఫీస్​ను 'పుష్ప-2' షేక్​ చేయడం పక్కా!! - పుష్ప 2 రిలీజ్​ తేదీ

'పుష్ప' సినిమా బ్లాక్​బస్టర్ హిట్ అందుకోవడం వల్ల.. 'పుష్ప-2'ను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే?

pushpa 2 dialogue leaked viral in internet
pushpa 2 dialogue leaked viral in internet

By

Published : Dec 11, 2022, 6:05 PM IST

Updated : Dec 11, 2022, 6:57 PM IST

అల్లు అర్జున్, రష్మిక.. హీరో, హీరోయన్లుగా సుకుమార్ తెరక్కించిన మూవీ 'పుష్ప‌- ది రైజ్'​. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా విడుదలైన ప్రతి చోటా కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగులో తెరకెక్కిన ఈ సినిమా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఒకేసారి ఐదు భాషల్లో విడుదలైన అల్లు అర్జున్ సినిమాగా 'పుష్ప' గుర్తింపు పొందింది. ఎర్రచందనం స్మగ్లర్​గా బన్నీ నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దేశవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా.. కేవలం హిందీలోనే ఏకంగా రూ.100 కోట్లు సంపాదించింది.

మరోవైపు 'పుష్ప-2' సినిమా చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్​. తొలి పార్ట్ మంచి విజయాన్ని అందుకోవడంతో రెండో భాగాన్ని అద్భుతంగా రూపొందించాలనే యోచనలో ఉన్నారు. ఈ మేరకు కథలో మార్పు చేర్పులు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఏడాదిలో ఆగస్ట్​లో పూజా కార్యక్రమాలు జరిగాయి.

ఈ నేపథ్యంలో 'పుష్ప-2'కు సంబంధించిన డైలాగ్ ఇదే అంటూ నెట్టింట వైరల్ అవుతోంది. "అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్ధం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప రాజ్ వచ్చాడని అర్థం" ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా హల్​చల్ చేస్తోంది. మరి ఈ డైలాగ్​ సినిమాలో ఉందో లేదో తెలియాలంటే విడుదలయ్యేవరకు వేచి చూడాల్సిందే.

Last Updated : Dec 11, 2022, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details