Pushpa 2 Lady Villain: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ మామూలుగా లేదు. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయిలో పుష్పరాజ్ వైరల్ అయ్యాడు. డైలాగ్స్, సాంగ్స్, స్టెప్పులు ఇలా సినిమాలో ప్రతీ అంశం ట్రెండ్‌గా మారింది. అన్నిటికంటే ముఖ్యంగా 'తగ్గేదేలే' అనే ఆ ఒక్క డైలాగ్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ ఒక్క డైలాగ్‌కు ప్రపంచంలోని సినీ ప్రియులంతా ఫిదా అయ్యారు. ఇంకా రష్మిక గ్లామర్‌కు తోడు అల్లుఅర్జున్ డ్యాన్స్, విలన్ పాత్రలో ఫాజిల్ యాక్టింగ్ అదనపు ఆకర్షణగా నిలిచాయి.
'పుష్ప-2' నుంచి సూపర్ అప్డేట్!.. లేడీ విలన్‌గా 'సరైనోడు MLA'? - పుష్ప 2 కేథరిన్ విలన్
దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించిన 'పుష్ప' సీక్వెల్' పుష్ప-2' షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. కానీ మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించి ఓ అప్డేట్ నెట్టింట వైరల్‌గా మారింది. సినిమాలో మరో లేడీ విలన్ కూడా ఉన్నారని తెలుస్తోంది. ఆమె పాత్ర మొదట పాజిటివ్‌గా కనిపించి, ఆఖర్లో బన్నీకి షాక్ ఇచ్చేలా ఉంటుందని టాక్.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను కలెక్షన్స్‌తో షేక్ చేసింది. ఇక ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తామని చెప్పిన సుకుమార్.. ఇప్పుడు సెకండ్ పార్ట్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్లు సుకుమార్ ఇవ్వలేదు. కానీ నెట్టింట మాత్రం వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా మరో అప్డేట్ నెట్టింట వైరల్‌గా మారింది. సినిమాలో మరో లేడీ విలన్ కూడా ఉన్నారని తెలుస్తోంది. మొదటి పార్ట్‌లో అనసూయ నెగిటివ్ పాత్రలో కనిపించారు. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్‌లో హీరోయిన్ కేథరిన్‌ను తీసుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె పాత్ర మొదట పాజిటివ్‌గా కనిపించి, ఆఖరిలో బన్నీకి షాక్ ఇచ్చేలా ఉంటుందని టాక్. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.