Pushpa 2 Alluarjun double role: బన్నీ-సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప' సూపర్‌హిట్ అవ్వడం వల్ల రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా సెట్స్‌పైకి వెళ్లని ఈ చిత్రం గురించి రోజుకో వార్త బయటకు వస్తూ అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే రెండో భాగం కోసం కథలో మార్పులు చేస్తున్నట్లు తెలిసింది. కొన్ని కీలక పాత్రల్ని క్రియేట్ చేసి.. వాటి కోసం ఆయా సినీపరిశ్రమల్లోని ప్రముఖ నటీనటుల్ని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం అందుతోంది.
ఛాలెంజింగ్ రోల్లో బన్నీ.. 55ఏళ్ల వ్యక్తిగా?
అల్లుఅర్జున్ గురించి.. అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించే వార్త ఒక్కటి ఫిల్మ్సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం దీని గురించే తెగ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అదేంటంటే?
అయితే ఇప్పుడు బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది! ఒకటి కొడుకు పాత్ర కాగా, మరొకటి తండ్రి రోల్ అని తెలిసింది. కొడుకు పాత్రలో యంగ్‌గా.. తండ్రి పాత్రలో(పుష్పరాజ్) 55ఏళ్ల వ్యక్తిగా కనిపించనున్నట్లు టాక్. అయితే ఇందులో నిజమెంతో తెలియాలంటే సినిమా వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. అంతకుముందు ఈ చిత్రంలో రష్మికతో పాటు మరో హీరోయిన్ కూడా నటించనుందని వార్తలు వచ్చాయి. ఆ కథానాయిక బన్నీ(కొడుకు పాత్ర) కోసమే అని అంటున్నారు. కాగా, తొలి భాగం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. బాలీవుడ్‌లోనూ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా రూ.100కోట్లు సాధించింది. మొత్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ట్రెండ్ సెట్ చేసింది. దీంతో సుకుమార్ రెండో భాగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదీ చూడండి: వీడని సస్పెన్స్.. యశ్ ప్లాన్ ఏంటి?