తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ప్రేక్షకులను తప్ప నేనెవరినీ మోసం చేయలేదు'.. నెట్టింట వైరల్​గా మారిన పూరీ లెటర్! - లైగర్ సినిమా

ఓటమి, గెలుపు.. జీవితం గురించి టాలీవుడ్​ దర్శకుడు పూరీ జగన్నాథ్​ రాసిన లేఖ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​ అవుతోంది. 'లైగర్​' పరాజయం తర్వాత పూరీ పర్సనల్​, ప్రొఫెషనల్​ లైఫ్​పై​ పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పూరీ స్పందించారు. తన పరిస్థితిని వివరిస్తూ ఓ లేఖ విడుదల చేశారు.

puri jagannadh note about liger failure
puri jagannadh note about liger failure

By

Published : Oct 30, 2022, 12:56 PM IST

Puri Jagannadh Letter: దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన ప్రాజెక్ట్‌ 'లైగర్‌'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పొందింది. ఈ చిత్రాన్ని కొనుగోలు చేసి తాము నష్టపోయామని, తమకు తిరిగి డబ్బు చెల్లించాలని పలువురు డిస్ట్రిబ్యూటర్లు తనని వేధిస్తున్నారని ఇటీవల ఆయన పోలీసులను ఆశ్రయించారు.

'లైగర్‌' ఫ్లాప్‌, వివాదం నేపథ్యంలో.. దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఆయన ఆర్థిక పరిస్థితి, కెరీర్‌ గురించి నెటిజన్లు పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పూరీ ఓ లేఖ విడుదల చేశారు. మనిషి జీవితం ఎలా ఉంటుంది? సక్సెస్‌, ఫెయిల్యూర్‌పై.. తన అభిప్రాయాన్ని అందులో తెలియజేశారు. జీవితంలో జయాపజయాలు సర్వసాధారణమని అన్నారు.

జీవితాన్ని ఒక సినిమాలా చూడాలని, అది విజయం సాధిస్తే డబ్బు వస్తుందని, పరాజయం పొందితే బోలెడు జ్ఞానం లభిస్తుందని చెప్పారు. నిజాన్ని నిజమే కాపాడుతుందని, ప్రేక్షకుల పట్ల తాను ఎప్పుడూ బాధ్యతగానే ఉంటానని పేర్కొన్నారు. మళ్లీ ఓ సినిమా చేస్తానని, తప్పకుండా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తానని చెప్పారు. తాను తన సినిమా టికెట్​ కొన్ని ప్రేక్షకులను తప్పి ఎవర్నీ మోసం చేయలేదని తెలిపారు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్‌గా మారింది.

పూరీ జగన్నాథ్​ రాసిన లేఖ

ఇవీ చదవండి :ఓవైపు 'సలార్'.. మరోవైపు 'వీరమల్లు'.. రామోజీ ఫిల్మ్​సిటీలో స్టార్ల షూటింగ్

'వాటర్​ క్యాన్లు మోసుకెళ్లా.. అప్పులోళ్లకు కనబడకుండా మారువేషాల్లో తిరిగా'

ABOUT THE AUTHOR

...view details