puri jagannadh ram pothineni movie : లవర్‌బాయ్ ఇమేజ్ ఉన్న హీరో రామ్ పోతినేని.. 'ఇస్మార్ట్ శంకర్'తో మాస్ హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రతీ సినిమాకు కథతో పాటు లుకింగ్ స్టైల్లోనూ వైవిధ్యతను చూపిస్తున్నారు. తన నటనతో మాస్ అండ్ క్లాస్ ఆడియెన్స్‌కు చేరువయ్యారు. 'ది వారియర్' డిజాస్టర్ తర్వాత ఆయన దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి 'స్కందా' అనే భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేశారు. ఇది ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.
దీంతో రామ్ తన కొత్త సినిమాపై ఫోకస్ట్ స్టార్ట్ చేసేశారు. ఆయన ఇప్పుడు.. కష్టాల్లో ఉన్నప్పుడు తనకు లైఫ్ ఇచ్చిన మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి సినిమా షురూ చేశారు. వీరిద్దరు కలిసి గతంలో పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్‌గా 'డబుల్ ఇస్మార్ట్' చేయబోతున్నారు. ఈ చిత్రం సోమవారం జులై 10న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. జులై 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. దీంతో రామ్.. డుబల్ ఇస్మార్ట్ వరల్డ్‌లోకి పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయారు. పాత లుక్ మాస్ అవతార్‌గా సిద్ధమయ్యారు.
జులై 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. దీంతో రామ్ ఈ చిత్రం కోసం.. డబుల్ ఇస్మార్ట్ వరల్డ్‌లోకి పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయారు. మళ్లీ మాస్ అవతార్‌గా మారిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఆయన లుక్ చేంజ్ చేస్తున్నట్లు చూపించారు. రామ్.. షార్ట్ స్పైక్డ్ హెయిర్ స్టైల్లోకి మారిపోయారు. గడ్డాన్ని కూడా ట్రిమ్ చేశారు. ఫైనల్‌గా ఓ స్టైలిష్ అండ్ మాస్ అవతార్‌గా చేంజ్ అయిపోయారు.
ram pothineni ismart shankar : 'ఇస్మార్ట్ శంకర్'లో హీరో మెదడులోకి ఓ చిప్ ప్రవేశ పెట్టడంతో.. అతడు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు, ఎలా ప్రవర్తిస్తాడు అనేది చూపించారు. అయితే ఈ సారి అంతకుమించి డబుల్ రేంజ్లో డబుల్ ఇస్మార్ట్‌లో చూపించబోతున్నట్లు ఈ వీడియో ద్వారా తెలిపారు రామ్. వీడియో చివర్లో ఆయన.. తన బ్యాక్ సైడ్ కట్టింగ్‌ను చూపిస్తూనే.. బ్యాక్ హెడ్‌ను హైలైట్ చేశారు. దీంతో రెండో భాగంలో ఏం చూపించబోతున్నారా అన్న క్యూరియాసిటీని మరింత పెంచారు.