"ఇంటర్వ్యూ చేయాలంటే కాస్త కంగారుగా ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ‘బద్రి’ తర్వాత నేను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా ట్రై చేశా. మా బంధువు సాయంతో మొదటిసారి మిమ్మల్ని కలిశా. ‘కథ ఏమైనా ఉంటే చెప్పు’ అని మీరు అడిగారు. మీతో నా మొదటి మీటింగ్ అదే. ఈరోజు మీతో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది"
"మీరు దర్శకత్వం వహించిన ‘ఇడియట్’ రిలీజైనప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పరిశ్రమలోనే ఉన్నా. ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆ సినిమా చూడటం ఓ మంచి అనుభూతిని అందించింది. ఆ సినిమా రిలీజైనప్పుడు మా ఏడీ బ్యాచ్ మొత్తం ఆ సినిమా గురించే మాట్లాడుకునేవాళ్లం. ఈ సినిమాతో ప్రేమలో కొత్త ఫార్ములాని మీరు పరిచయం చేశారు. ప్రతి సీన్‌లో ఓ డైలాగ్ రాశారు" అని సుకుమార్ చిట్‌చాట్ ప్రారంభించగా
పూరీ:ఇడియట్ తర్వాత నాకు ఒక కొత్త జీవితం, కెరీర్ పరంగా మంచి గుర్తింపు వచ్చింది. నాకు ఒక్కడికే కాదు మా యూనిట్ మొత్తానికి ఆ సినిమాతో మంచి లైఫ్ లభించింది.
సినిమా తెరకెక్కించే సమయంలో మీరు కంగారు పడతారా?
పూరీ:ఒక సినిమా అనుకున్నప్పుడే నేను పూర్తి క్లారిటీతో ఉంటా. ఆ సినిమాని ఎలా చేయాలి? ఎప్పుడు ఏ సీన్ చేయాలి? ఇలా అన్ని విషయాల్లో ఓ క్లారిటీ ఉంటుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఒకవేళ ఫస్ట్‌డేనే క్లైమాక్స్ షూట్ చేద్దామన్నా నేను కంగారు పడకుండా చేసేస్తా.
సుకుమార్: నేను అలా కాదు సర్.. షూట్ చేస్తున్నంతసేపు చాలా కంగారు పడుతుంటా. వర్షం పడి షూట్ క్యాన్సిల్ అయితే పైకి ‘అయ్యో’ అంటాను కానీ లోపల మాత్రం సంతోషిస్తా.
మీ సినిమాలో ఎక్కువగా నైట్ షాట్స్ ఎందుకు ఉండవు?
పూరీ:రాత్రి షూట్ ఉండే సన్నివేశాలను నేను చాలావరకూ రాయను. అలాంటి సన్నివేశాలు రాసినా.. అవసరాన్ని బట్టి వాటిని షూట్ సమయంలో తొలగించేస్తా. ఎందుకంటే, రాత్రి షూట్ అంటే ప్రొడెక్షన్ ఖర్చులు పెరిగిపోతాయని అనుకుంటా. తప్పదు అనుకుంటే ఆ సీన్స్ తెరకెక్కిస్తా. లేదంటే సాయంత్రం 6 గంటలకే షూట్ పూర్తయ్యేలా చూస్తా. షూట్ పూర్తైన వెంటనే పార్టీలో పాల్గొంటా. ఆ తర్వాత రోజు అనుకున్న టైమ్‌కి సెట్‌లోకి వచ్చేస్తా. సెట్‌లోకి అడుగుపెట్టే సమయానికి మైండ్ మొత్తం బ్లాంక్‌గా పెట్టుకుంటా. నా ఫస్ట్ సినిమాకి మాత్రమే ఫుల్ స్క్రిప్ట్, డైలాగ్ టు డైలాగ్ రాసుకున్నా. ఆ తర్వాత ఎప్పుడూ రాయలేదు.
స్క్రిప్ట్ వర్క్ ఎక్కడ రాస్తారు?
పూరీ:నేను ఎక్కువగా బీచ్‌లో కూర్చొని కథలు రాస్తుంటా. అది కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే. ఒక్కోసారి భోజనానికి కూడా వెళ్లను. ఆరు దాటిన తర్వాత నా మైండ్ మొత్తం వేరే ఆలోచనల్లోకి వెళ్లిపోతుంది.
వెంట వెంటనే సినిమాలు చేసే మీరు ‘పోకిరి’కి మాత్రం కాస్త సమయం తీసుకున్నారు కదా..!
పూరీ:నువ్వు నాకు చాలా సార్లు చెప్పావు. ‘రెండు వారాల్లో కథలు రాయొద్దు. మరో రెండు వారాలకు రాయండి అలా చేస్తే బెటర్ సినిమా అవుతుంది’ అని. నువ్వు చెప్పిందే నేను ఫాలో అవుతున్నా. త్వర త్వరగా సినిమాలు చేయాల్సిన అవసరం ఏముంది. చాలా సినిమాలు చేశాం. టైమ్ తీసుకుని కథ రాసి, దాన్ని అందరికీ వినిపించి, చేద్దామని ఫిక్స్ అయిపోయా.
సుకుమార్: ‘లైగర్’ తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పగలను. ఎందుకంటే, ఈ సినిమాకి మీరు సమయం ఎక్కువగా తీసుకున్నారు. రూ.1000 కోట్లు వసూళ్లు రాబడుతుందని నమ్ముతున్నా.
‘లైగర్’ ఆలోచన ఎలా మొదలైంది?
పూరీ:పదేళ్ల క్రితం ‘ఇద్దరమ్మాయిలతో..’ చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ ఒక హాలీవుడ్ డైరెక్టర్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఆ దర్శకుడు ఏ సినిమా చేసినా అందులో హీరోకి ఏదో ఒక లోపం ఉండేలా చూపిస్తాడు. అలాంటి పాత్ర మీరు కూడా రాయొచ్చు కదా’’ అని అడిగాడు. నత్తితో ఇబ్బందిపడే హీరో పాత్రపై సినిమా రాస్తే ఎలా ఉంటుందని నేను అడగ్గా.. ‘సూపర్ ఉంటుంది. రాయండి’ అని చెప్పాడు. ఈ కథ అలా మొదలైంది. ఈ ఐడియా వచ్చిందే బన్నీ వల్ల.
కథ ఎలా మొదలైంది..?
పూరీ:మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. బన్నీతో మాట్లాడిన తర్వాత నత్తి+ఎంఎంఏతో సినిమా రాశా.
మీ సినిమాల్లో ఎక్కువగా హీరోని అనాథగా చూపిస్తారు. అలాగే పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన సీన్స్ కూడా ఎక్కువగా చూపిస్తారు? ఎందుకలా? చిన్నతనంలో మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
పూరీ:నాకు డార్క్ చైల్డ్‌వుడ్ ఏమీ లేదు. అమ్మానాన్నా చక్కగా పెంచారు. తల్లిదండ్రులు బాగుండి.. వాళ్ల సంరక్షణలో పెరిగిన పిల్లల కంటే.. వాళ్లిద్దరూ లేకుండా జీవితాన్ని సాగిస్తున్న చిన్నారులు ఎక్కువగా బాధలు ఎదుర్కొంటారు. మన పిల్లల కంటే వాళ్లెంతో స్ట్రాంగ్‌గా ఉంటారు. ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొంటారు. అలాంటి బాధను అనుభవించి పెరిగిన వాళ్లు ఎంతో ధైర్యవంతులని నేను భావిస్తుంటా. అందుకే నా హీరోలను అలా చూపిస్తా.
ఒక్క క్యారెక్టర్‌తోనే సినిమా చేయవచ్చు అని మా జనరేషన్ వాళ్లకు ‘ఇడియట్’ ద్వారా మీరే తెలియజేశారు. ఆ సినిమాలో ప్రకాశ్‌రాజ్ పాత్రని మొదటి నుంచి మంచోడిగా చూపించి.. చివరికి విలన్‌గా చేశారు. ఇలాంటి పాత్ర ఎలా రాశారు..?
పూరీ:ఆ పాత్ర చాలా బాగుంటుంది. ‘బద్రి’ సినిమాలోనూ ప్రకాశ్‌రాజ్ విలన్‌గా కనిపిస్తాడు. కానీ చాలా మంచోడు. చెల్లిని సంరక్షించుకోవాలనుకుంటాడు. అలాగే ‘ఇడియట్’లోనూ తన కూతురిని ఒక ఇడియట్ బారి నుంచి కాపాడుకోవాలని ఆయన కోరుకుంటాడు. అవి రెండూ కొత్త ఆలోచనలే.
ఒకవేళ ఎప్పుడైనా ఆర్టిస్ట్‌లు రావడం ఆలస్యమైతే ఏం చేస్తారు?