తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పూరీ-రామ్​ 'డబుల్​ ఇస్మార్ట్​'.. పవన్​ కల్యాణ్​ 'ఓజీ' నుంచి క్రేజీ అప్డేట్​! - పూరీ జగన్నాథ్​ రామ్ పోతినేని కొత్త సినిమా

'లైగర్'​తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పూరీ జగన్నాథ్​.. తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. మరోవైపు పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ సినిమా 'ఓజీ' నుంచి ఓ క్రేజీ అప్డేట్​ వచ్చింది. ఆ వివరాలు..

puri jagannath pawan kalyan
puri jagannath pawan kalyan

By

Published : May 14, 2023, 10:27 PM IST

విజయ్​ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా 'లైగర్'​. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్​ డైరెక్షన్​ చేశారు. భారీ అంచనాలతో పాన్​ ఇండియా రేంజ్​లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో పూరీ తదుపరి సినిమా ఎవరితో అనే చర్చ జరుగింది. అయితే, ఈ చర్చకు ప్రస్తుతం తెరపడింది. పూరీ నెక్స్ట్​ మూవీని అధికారికంగా ప్రకటించారు. ఎనర్జిటిక్​ స్టార్​ రామ్​ పోతినేనితో తదుపరి చిత్రం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు 'డబుల్ ఇస్మార్ట్' అనే మూవీని తెరకెక్కిస్తున్న తెలిపారు.

అయితే, వీరిద్దరి కాంబినేషన్​లో గతంలో వచ్చిన మూవీ 'ఇస్మార్ట్​ శంకర్'. ఆ సినిమా తర్వాత సీక్వెల్​ ప్లాన్​ చేస్తున్నట్లు అప్పట్లో చెప్పారు పూరీ. ఇప్పుడు ఆ మేరకు డబుల్​ ఇస్మార్ట్​ను ప్రటించారు. దీంతోపాటు ఓ పోస్టర్​ను కూడా విడుదల చేశారు. అందులో ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చిన 8న పాన్​ ఇండియా లెవల్​లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇస్మార్ట్​ శంకర్​ క్లైమాక్స్​ను శివుని త్రిశూలంతో మూగించారు. ఇప్పుడు ఈ పోస్టర్​పై త్రిశూలం, శివలింగం కనిపిస్తుండడం వల్ల అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

#OG.. కొత్త షెడ్యూల్​..
సాహో ఫేమ్​.. దర్శకుడు సుజిత్ డైరెక్షన్​లో ఓ భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ సినిమా చేస్తున్నారు పవర్​ స్టార్​ పవన్ కల్యాణ్​. ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) టైటిల్​తో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్​ అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ ప్రకారం ఓజీ తదుపరి షెడ్యూల్ హైదరాబాద్​లో మే 17 నుంచి మొదలు కానుంది. కొన్ని రోజులు పాటు సాగనున్న ఈ చిత్రీకరణలో మరిన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ మేరకు సినీ వర్గాల్లో టాక్​ నడుస్తోంది. డీవీవీ ఎంటర్​టైన్మెంట్స్​ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్​ కల్యాణ్​ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ ఆడిపాడనుంది.

ముంబయి మాఫియా బ్యాక్ డ్రాప్​లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. దీంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి అయితే ఓకే కానీ.. మరీ 2025 సంక్రాంతి అంటే చాలా ఆలస్యమని.. రెండేళ్లు ఆగలేమని అభిమానులు అంటున్నారు. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు కోసం రెండేళ్లుగా వెయిట్​ చేయలేకపోతున్నామని.. ఇప్పుడు మళ్లీ ఓజీ కోసం కూడా మరో రెండేళ్లు ఎదురుచూడాలా అని తమ బాధను వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details