తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మళ్లీ పట్టాలెక్కనున్న పూరీ జగన్నాథ్ కలల ప్రాజెక్ట్.. ఈసారి బాలీవుడ్​లో!

టాలీవుడ్​ స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ నుంచి మరో అప్​డేట్ వచ్చింది. 2018లోనే ప్రకటించినా.. అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన తన కలల ప్రాజెక్ట్​ 'జనగణమన' మళ్లీ పట్టలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సారి తన సినిమాను టాలీవుడ్ నుంచి బాలీవుడ్​ షిఫ్ట్​ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

puri jagannadh jana gana mana movie
puri jagannadh jana gana mana movie

By

Published : Oct 24, 2022, 10:21 PM IST

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కలల ప్రాజెక్టు 'జనగణమన'. ఈ సినిమాను పూరీ 2018లోనే ప్రకటించారు. మొదట ఈ చిత్రంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించనున్నారంటూ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఈ సినిమాకు సంబంధించిన న్యూస్‌ ఏమీ బయటకు రాలేదు. అయితే ఇటీవల విజయ్‌ దేవరకొండ తన కలల ప్రాజెక్టులో నటిస్తున్నారని..పాన్‌ ఇండియా స్థాయిలో హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోందని తెలిపారు.

అయితే ఇటీవల వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'లైగర్‌' ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. దీంతో పూరీ జగన్నాథ్‌ మళ్లీ ఈ సినిమాను పక్కనపెట్టారనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ 'జనగణమన' కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్‌లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమాను పూరీజగన్నాథ్‌ బాలీవుడ్ నటీనటులతో తీయాలని చర్చలు జరుపుతున్నారట. రణ్‌వీర్‌ సింగ్‌, విక్కీ కౌశల్‌ను సంప్రదించినట్లు సమాచారం. వీరిద్దరిలో ఒకరు ఒప్పుకుంటే ఈ సినిమా పట్టాలెక్కుతుందని పూరీ జగన్నాథ్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ శివనిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి'లో నటిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details