తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బండ్ల గణేశ్​కు పూరి స్ట్రాంగ్​ కౌంటర్​? చీప్ మాటలు, చేతలు వద్దంటూ..! - బండ్ల గణేశ్

ఆకాష్ నటించిన 'చోర్​ బజార్'​ ప్రీరిలీజ్​ ఈవెంట్​లో పూరి జగన్నాథ్​పై ఘాటు వ్యాఖ్యలు చేశారు నిర్మాత బండ్ల గణేశ్​. పూరి.. కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు. దీంతో ఇటీవలే విడుదల చేసిన ఓ పాడ్​కాస్ట్​లో గణేశ్​ను ఉద్దేశించి పూరి గట్టిగా కౌంటర్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. చీప్ మాటలు, ప్రవర్తన వద్దని అందులో చురకలంటించారు!

bandla ganesh puri jagannadh
puri jagannadh podcast

By

Published : Jun 26, 2022, 12:52 PM IST

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్​కు దర్శకుడు పూరి జగన్నాథ్ పరోక్షంగా గట్టి కౌంటర్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. పూరి తనయుడు ఆకాష్ నటించిన 'చోర్​ బజార్'​ చిత్ర ప్రీరిలీజ్​ ఈవెంట్​లో పూరిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు గణేశ్. కొడుకును పూరి పట్టించుకోవడం లేదని అన్నారు. అయినా అతడు పెద్ద స్టార్ అవుతాడని అన్నారు. పూరి భార్య లావణ్యను ప్రశంసిస్తూ.. పూరిపై పలు విమర్శలు చేశారు.

"పూరి అన్న వద్ద ఏమీ లేని సమయంలోనే మా వదిన లావణ్య అతడి వెంట ఉంది. అన్నీ వచ్చాక కొన్ని ర్యాంపులు, వ్యాంపులు ఆయన వద్దకు వచ్చి చేరాయి. బయటవాళ్లను స్టార్​లను చేస్తూ.. కన్న కొడుకు ఫంక్షన్​ జరిగేటప్పుడు ముంబయిలో ఉండటం సరికాదు. తలకొరివి పెట్టేది కొడుకే. మనం ఏమి చేసినా కుటుంబం కోసమే. ఆ తర్వాతే ఎవరైనా" అంటూ పూరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు బండ్ల గణేశ్.

ఈ క్రమంలోనే శనివారం ఓ పాడ్​కాస్ట్​ విడుదల చేశారు పూరి జగన్నాథ్. "గుర్తు పెట్టుకోండి మన నాలుక కదులుతున్నంత సేపు మనం ఏమీ నేర్చుకోలేం. అందుకే లైఫ్​లో ఎక్కువ సమయం పాటు శ్రోతలుగా ఉంటే మంచిది. మీ కుటుంబసభ్యులు, దగ్గరి బంధుమిత్రులు, సహోద్యోగులు, ఆఖరికి కట్టుకున్న భార్య దగ్గర కూడా ఆచితూచి మాట్లాడండి. చీప్​గా వాగొద్దు. చీప్​గా ప్రవర్తించొద్దు. మన వాగుడు మన కెరీర్​ను, క్రెడిబిలిటీని నిర్ణయిస్తుంది. మీకు సుమతీ శతకం గుర్తుండే ఉంటుంది. 'నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి' అని. తప్పు మాట్లాడటం కంటే నాలుక కొరికేసుకోవడం చాలా మంచింది. చివరగా ఓ మాట.. మీ జీవితం, చావు.. నోరు మీదే ఆధారపడి ఉంటాయి." అని అందులో మాట్లాడారు పూరి. దీంతో ఈ వ్యాఖ్యలు గణేశ్​ను ఉద్దేశించినవే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇదీ చూడండి:బండ్లగణేశ్ ఆడియో మెసేజ్​ వైరల్​.. అందులో ఏముందంటే?

ABOUT THE AUTHOR

...view details