డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ భామ దీపికా పదుకొణె జంటగా రాబోతున్న సినిమా 'ప్రాజెక్ట్- కె'. ప్రముఖ హిందీ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో పోషించనున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు. వైజయంతీ ఫిల్మ్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ప్రాజెక్ట్-K నుంచి క్రేజీ అప్డేట్.. స్క్రాచ్ నుంచి వచ్చిన టైర్.. వీడియో అదుర్స్! - దీపికా పదుకొణె
మహానటి, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల దర్శకుడు నాగ్ అశ్విన్.. ప్రాజెక్ట్-కె మూవీలోని ఓ వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.
Project K Movie
ఈ సందర్భంగా 2023 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది. ప్రాజెక్ట్- కెలో కీలకంగా నిలిచే వాహనాల టైర్ల తయారీతో కూడిన స్పెషల్ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ప్రాజెక్టు-కె గ్యారెజ్‌లో స్క్రాచ్ నుంచి ఒక టైర్‌ను ఎలా తయారు చేశారో చూపిస్తూ.. సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉన్న వీడియోను షేర్ చేశారు. కాగా, ఈ చిత్రానికి ప్రముఖ వాహనాల తయారీ సంస్థ మహీంద్ర కీలక సహకారాన్ని అందిస్తుండటం విశేషం.
Last Updated : Dec 31, 2022, 1:31 PM IST