Project K First Glimpse : ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియూలందరూ ఎదురుచూసిన 'ప్రాజెక్ట్ కె' ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది. అంతేకాకుండా ఈ సినిమాకు 'కల్కి 2898 ఏడీ' అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. 'ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది. అప్పుడు అంతం అరంభమవుతుంది' అనే నేపథ్యంలో ఈ చిత్రం సాగనున్నట్లు తెలుస్తోంది. 'వాటీజ్ ప్రాజెక్ట్ కె' అనే ఒక్క డైలాగ్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. విజువల్స్ అందరినీ కట్టిపడేశాయి. ఇక ప్రభాస్ లుక్ అదిరిపోయింది.
అమెరికాలో జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక 'శాన్ డియాగో కామిక్ కాన్' వేడుకలో చిత్ర బృందం గ్లింప్స్, టైటిల్‌ని ప్రకటించింది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసింది. ఇక ఆ ఈవెంట్‌లో ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించుకున్న తొలి భారతీయ సినిమాగా ఇది రికార్డుకెక్కింది. ఇక మూవీ యూనిట్ నుంచి ప్రభాస్, కమల్ హాసన్, నిర్మాత అశ్వనీదత్ తదితరులు ఆ కార్యక్రమంలో పాల్గొని, సందడి చేశారు. వీరితోపాటు టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అప్డేట్ను కామిక్ కాన్ వేదికగా ప్రకటించారు.