Project K Deepika Poster : ప్రాజెక్ట్-కే నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈసారి దీపిక ఫ్యాన్స్ పండగ చేసుకునే ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది ప్రాజెక్ట్-కే చిత్ర బృందం. బాలీవుడ్ అందాల తార దీపిక పదుకొణె బర్త్ డే సందర్భంగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో దీపిక ఓ యోధురాలిగా కనిపిస్తోంది. చీకట్లో నిల్చున్న ఆమె చిత్రంపై 'చీకటిలో ఓ ఆశాదీపం' అని రాసి ఉంది. దీంతోపాటు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పోస్టర్ కింద రాసింది చిత్ర బృందం. దీపిక పదుకొణె పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ పోస్టర్లో ఓ యోధురాలుగా కనిపిస్తున్న ఆమెను చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
దీపికకు 'ప్రాజెక్ట్-కే' టీమ్ బర్త్‌డే గిఫ్ట్.. 'చీకటిలో ఓ ఆశాదీపం' అంటూ.. - ప్రాజెక్ట్ కే చిత్రంలో దీపికా పోస్టర్ రిలీజ్
బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె పుట్టిన రోజు సందర్భంగా 'ప్రాజెక్ట్-కే' చిత్ర బృందం ఆమెకు సర్ప్రైజ్ గిఫ్ట్ అందించింది. పోస్టర్లో దీపికను చూసిన ఆమె ఫ్యాన్స్ ఉర్రూతలూగుతున్నారు. ఇంతకీ ఆ పోస్టర్లో ఏం ఉందంటే?..
500 కోట్ల బడ్జెట్‌తో భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతోంది 'ప్రాజెక్ట్-కే'. ఈ సినిమాకు నాగ్అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. సీజీ, పోస్ట్ ప్రొడక్షన్ మెరుపులన్నింటిని అద్దుకుని ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అంతకు ముందు బాలీవుడ్ బిగ్ బాస్ అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి ఆయనకు సర్ప్రైజ్ ఇచ్చింది ప్రాజెక్ట్-కే చిత్ర బృందం. ఇప్పుడు ఇదే తరహాలో దీపికాకు కూడా సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఆమె ఉన్న ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఇవీ చదవండి: