తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆమె ఒక మహా'నటి".. సమంతపై నాగచైతన్య మేనమామ కీలక కామెంట్స్ - unstopable show balakrishna

సమంతపై నాగచైతన్య మేనమామ కీలక కామెంట్లు చేశారు. ఆమెను మహానటి అన్నారు. దీంతో ఆ కామెంట్లు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి..

producer suresh babu comments on samantha
producer suresh babu comments on samantha

By

Published : Dec 3, 2022, 5:08 PM IST

Updated : Dec 3, 2022, 5:14 PM IST

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్​స్టాపబుల్ 2' షోలో గెస్టుగా వెళ్లారు నిర్మాత సురేష్​ బాబు. బాలయ్యతో మాట్లాడుతూ సమంతపై కీలక కామెంట్లు చేశారు. ఆమెను ఈ తరం మహానటిగా అభివర్ణించాడు. ఇంతకీ ఆయన ఎందుకు అలా అన్నారంటే..

యువసామ్రాట్​ అక్కినేని నాగచైతన్య-సమంత విడాకులు తీసుకొని విడిపోయారు. గతేడాది అక్టోబర్ నెలలో ఈ జంట సోషల్​మీడియా వేదికగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లు వెల్లడించారు. వీరి విడాకులపై నాగచైతన్య ఫ్యామిలీ దాదాపు స్పందించలేదు. నాగార్జున మాత్రం.. సమంత మంచి అమ్మాయి.. విడాకులు తీసుకోవడం దురదృష్టకరం అన్నారు.

అయితే ఈ విషయంలో నాగచైతన్య పూర్తిగా సైలెంట్. కనీసం ఒక సోషల్ మీడియా పోస్ట్ కూడా చేయలేదు. జస్ట్ విడాకుల తీసుకుంటున్నట్లు ఒక నోట్ షేర్ చేశారు. మరోవైపు సమంత మాత్రం తన అసహనం వెళ్లగక్కారు. ఇంటర్వ్యూల్లో ఆవేశపూరిత కామెంట్స్ చేశారు. తాజాగా సురేష్ బాబు చేసిన కామెంట్స్ ద్వారా సమంత పట్ల దగ్గుబాటి ఫ్యామిలీ ఏం అనుకుంటున్నారో తెలిసింది.

కాగా సురేష్ బాబు, అల్లు అరవింద్ 'అన్​స్టాపబుల్ 2' షోలో పాల్గొన్నారు. హోస్ట్ బాలకృష్ణ టాస్క్ లో భాగంగా.. ఈ తరం మహానటి ఎవరో చెప్పాలని ఇద్దరినీ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు వారిద్దరూ ఒకే అభిప్రాయం వెల్లడించారు. ఆ ఛాన్స్ ఒక్క సమంతకు మాత్రమే ఉందన్నారు. 'ఈ జనరేషన్ లో మహానటి సావిత్రిలా పేరు తెచ్చుకునే అవకాశం కేవలం సమంతకు మాత్రమే ఉంది' అని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. దీంతో నాగ చైతన్యకు సమంత దూరమైనందుకు ఆమెపై దగ్గుబాటి కుటుంబానికి ఎలాంటి కోపం లేదని తేలిపోయినట్లే.

Last Updated : Dec 3, 2022, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details