తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సినీ దిగ్గజం కె.విశ్వనాథ్ , సీనియర్ దర్శకుడు సాగర్ మరణ వార్తలను మరవకముందే ప్రముఖ నిర్మాత ఆర్.వి.గురుపాదం (53) కన్నుమూశారు. శనివారం ఉదయం గుండెపోటు రావడంతో బెంగళూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో చిత్రపరిశ్రమలో విషాద వాతావరణం నెలకొంది. సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.
టాలీవుడ్లో మరో విషాదం.. మూడు రోజుల్లో ముగ్గురు..
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ దిగ్గజం కె.విశ్వనాథ్ , సీనియర్ దర్శకుడు సాగర్ మరణ వార్తలను మరవకముందే ప్రముఖ నిర్మాత ఆర్.వి.గురుపాదం (53) కన్నుమూశారు.
తెలుగులో తెరకెక్కిన వయ్యారి భామలు వగలమారి భర్తలు, పులి బెబ్బులి చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడలో సుమారు 25 చిత్రాలను ఆయన నిర్మించారు. హిందీలో శ్రీదేవి కథానాయికగా నటించిన అకల్ మండ్ చిత్రానికి గురుపాదం నిర్మాతగా వ్యవహరించారు. పలు తమిళ, మలయాళ చిత్రాలను తెలుగులోకి అనువాద చిత్రాలుగా తీసుకొచ్చారు. గురుపాదం మరణం పాట్ల దర్శకుడు రుషేందర్ రెడ్డి సహా పలువురు దర్శక నిర్మాతలు సంతాపం ప్రకటించారు.
ఇదీ చూడండి: దళపతి 67 'లియో' టీజర్.. విక్రమ్, ఖైదీకి కనెక్షన్.. ఈ సీన్స్‌ను కనిపెట్టారా?