తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాలయ్య సజెస్ట్ చేసిన సినిమాతో పవన్​ సూపర్​హిట్​.. ఆ మూవీ ఏంటంటే? - భీమ్లానాయక్​ బాలకృష్ణ

పవన్​కల్యాన్​ నటించిన ఓ సూపర్​హిట్​ సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించాల్సింది. కానీ బాలయ్యనే స్వయంగా ఆ చిత్రం పవన్​ చేస్తే బాగుంటుందని సూచించారట. ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే...

Bheemlanayak Balakrishna
భీమ్లానాయాక్​ బాలయ్య

By

Published : Oct 21, 2022, 7:58 PM IST

మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ అయ్యప్పనుమ్ కోషియుమ్​ను తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానాల కలయికలో 'భీమ్లా నాయక్' పేరుతో విడుదలై హిట్ అయింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించగా సాగర్ కె. చంద్ర ఈ రీమేక్​కు దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీకి ఫస్ట్ ఛాయిస్ పవన్ కల్యాణ్ కాదని తెలిసింది. ఈ మూవీని సితార ఎంటర్​టైన్​మెంట్​ బ్యానర్​పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. తనే ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్​గా వ్యవహరిస్తున్న టాక్ షో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్​బీకే'కు యువ హీరోలు విశ్వక్​సేన్​, సిద్ధు జొన్నలగడ్డతో కలిసి గెస్ట్​ వచ్చిన ఆయన ఈ విషయాన్ని చెప్పారు.

నాగవంశీతో బాలయ్య మాట్లాడుతూ.. 'భీమ్లానాయక్ సినిమా ఫస్ట్ ఛాయిస్ ఎవరు..?' అని ప్రశ్నించారు. దానికి నాగవంశీ.. 'మీరే సర్.. మేం మీ చుట్టూ తిరిగి హీరోగా మిమ్మల్ని అడిగిన తరువాత సినిమా చూసి కళ్యాణ్ గారు చేస్తే బాగుంటుందని మీరే కదా సజెస్ట్ చేశారు' అంటూ సమాధానమిచ్చారు. అలాగే ఇతర నిర్మాణ సంస్థల్లో త్రివిక్రమ్‌ పని చేయటం తనకు నచ్చదని పేర్కొన్నారు.

ఇక బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన గోపిచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. NBK 107 వర్కింగ్ టైటిల్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశముంది. ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సాయి మాధవన్ బుర్రా సంభాషణలు రాశారు. ఈ మూవీ తర్వాత ఆయన అనిల్​ రావిపూడితో ఓ సినిమా చేయనున్నారు. యువ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురిగా కనిపించబోతుంది.

ఇదీ చూడండి:ఊర్వశిరౌతేలాపై చాహల్ భార్య ఫన్నీ పోస్ట్​.. అందుకే పెట్టిందా?

ABOUT THE AUTHOR

...view details