తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ వార్తలను ఖండించిన సూర్య సినిమా నిర్మాత.. 10 నిమిషాల్లో ఫేమ్‌ పొందేందుకే.. - film suirya

తమ సినిమాపై వస్తున్న వదంతులను నమ్మవద్దని నిర్మాత కలైపులి అన్నారు. అసత్యాలను నమ్మొద్దని హీరో సూర్య అభిమానులకు ఆయన కోరారు. అసలేం జరిగిందంటే?

producer-kalaipuli-s-thanu-reaction-on-his-film-was-shelved-starring-suriya
producer-kalaipuli-s-thanu-reaction-on-his-film-was-shelved-starring-suriya

By

Published : Dec 23, 2022, 10:04 PM IST

సూర్య హీరోగా దర్శకుడు వెట్రిమారన్‌ 'వాడివాసల్‌' అనే చిత్రాన్ని ఇటీవల ప్రకటించారు. ఇప్పటికీ చిత్రీకరణ ప్రారంభంకాకపోవడంతో ఆ సినిమా ఆగిపోయిందంటూ వదంతులు వ్యాపించాయి. దీనిపై కోలీవుడ్‌ మీడియా.. చిత్ర నిర్మాత కలైపులి ఎస్‌. థానును ప్రశ్నించగా ఆయన స్పందించారు. ఆ వార్తలను ఖండించిన ఆయన అలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని కోరారు. కొందరు పది నిమిషాల్లో ఫేమ్‌ పొందేందుకు అలా చేస్తుంటారని, సినీ అభిమానులు వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఆ చిత్రం ఇంకా ప్రీ ప్రొడక్షన్‌ దశలోనే ఉందని వెల్లడించారు.

సి. ఎస్‌. చెలప్ప రాసిన 'వాడివాసల్‌' అనే నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. తమిళనాడులో ప్రసిద్ధిగాంచిన జల్లికట్టు ఆటకు సంబంధించిన కథాంశంతో రూపొందనుంది. మరోవైపు, ప్రముఖ దర్శకుడు బాల దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమా నుంచి సూర్య వైదొలిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శివ డైరెక్షన్‌లో నటిస్తున్నారు సూర్య. టైటిల్‌ ఖరారుకాని ఆ చిత్రంలో బాలీవుడ్‌ నటి దిశా పటానీ కథానాయికగా సందడి చేయనుంది.

ABOUT THE AUTHOR

...view details