తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నా 25ఏళ్ల కెరీర్‌లో 'శాకుంతలం' పెద్ద జర్క్‌: దిల్‌రాజు - శాకుంతలంపై దిల్​రాజు రియాక్షన్​

సమంత నటించిన శాకుంతలం సినిమా రిజల్ట్​పై మాట్లాడారు ప్రముఖ నిర్మాత దిల్​రాజు. ఇంకా పలు విషయాల గురించి కూడా చెప్పుకొచ్చారు. ఆ సంగతులు...

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 29, 2023, 6:57 PM IST

Updated : Apr 29, 2023, 7:12 PM IST

హీరోయిన్​ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'శాకుంతలం'. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పౌరాణికం సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్​గా నిలిచింది. దీనికి నీలిమ గుణ(గుణశేఖర్ కూతురు)తో పాటు దిల్​రాజు నిర్మాతలుగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంపై దిల్​రాజు స్పందించారు. తన 25ఏళ్ల కెరీర్‌లో ఈ రిజల్ట్​ పెద్ద జర్క్‌ అని అన్నారు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్‌రాజు ఈ వ్యాఖ్యలను చేశారు.

"నా 25 ఏళ్ల సినీ నిర్మాణ కెరీర్‌లో 'శాకుంతలం' పెద్ద జర్క్‌ ఇచ్చింది. ఆడియెన్స్​ ఇచ్చిన తీర్పును స్వాగితిస్తున్నా. ఈ సినిమాను నేను నమ్మాను. ఆడియెన్స్​కు నచ్చితే వారు ఆదరిస్తారు. ఒకవేళ వారికి నచ్చలేదంటే నా జడ్జిమెంట్‌ తప్పని భావిస్తాను. ఆ మిస్టేక్​ ఎలా, ఎక్కడ జరిగిందో ఒకసారి చెక్‌ చేసుకుని ముందుకు వెళ్తాను. 'శాకుంతలం'లో నా జడ్జిమెంట్‌ తప్పు అయింది. నా సుదీర్ఘ కెరీర్‌లో 50కు పైగా సినిమాలను నిర్మించాను. వాటిలో డిజాస్టర్​గా నిలిచినవి ఓ నాలుగైదు మాత్రమే ఉంటాయి. 'శతమానంభవతి' సినిమా సమయంలో యూఎస్‌లో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ వేశాం. అక్కడ అందరికీ నచ్చింది. 'శాకుంతలం'ను నాలుగు రోజులు ముందే షో ప్రదర్శించాం. మిక్స్​డ్​ టాక్​ వచ్చింది. ఇక శుక్రవారం మార్నింగ్‌ షో అవ్వగానే పరిస్థితి అర్థమైపోయింది. ఫస్డ్​ డే ఆడియెన్స్‌తో కలిసి సినిమా చూస్తే.. సినిమా ఆడుతుందో లేదో ఓ క్లారిటీ వచ్చేస్తుంది. కొన్నిసార్లు కొంతమందికి నచ్చి, మరికొంతమందికి నచ్చకపోవచ్చు. అలా డివైడ్‌ టాక్‌ రావొచ్చు. ఎక్కువ మందికి ఆ చిత్రం నచ్చలేదంటే అది ఫ్లాప్‌ అనే అర్థం. అలాగే డిస్ట్రిబ్యూటర్స్‌ నుంచి కూడా ఎలాంటి ఫోన్​ కాల్స్​ రావడం లేదంటే అర్థం చేసుకుంటాను. శుక్రవారం అయిపోతే ఇక ఆ సినిమా రిజల్ట్​ గురించి ఆలోచిండం వదిలేస్తా. శనివారం నుంచి కొత్త సినిమాలపై పూర్తి ఫోకస్​ పెడతా. మిస్టేక్స్​ రిపీట్​ అవ్వకుండా తర్వాతి ప్రాజెక్టులను ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుంటాను" అని దిల్​రాజు చెప్పుకొచ్చారు.

తమిళ హిట్ సినిమా '96' తెలుగు రీమేక్ విషయంలోనూ తన అంచనా తప్పైందని నిర్మాత దిల్‌రాజు గుర్తుచేసుకున్నారు. "ఆ సినిమాను అల్లు అర్జున్‌, నాని సహా ఇంకొంతమందికి చూపిస్తే చాలా బాగుందని చెప్పారు. అయితే ఆ సమయంలో కరోనా కారణంగా ఆ చిత్రాన్ని ఓటీటీలో ఎక్కువ మంది వీక్షించేశారు. ఆ తర్వాత 'జాను' రిలీజైంది. అయితే '96' చూసిన ఫీల్‌ను ఈ సినిమాతో ఆస్వాదించలేకపోయారు ప్రేక్షకులు. అలా 'జాను', 'జెర్సీ' సినిమాల విషయంలో నాకు అర్థమైంది ఏంటంటే.. ఓటీటీలో వచ్చేసిన తర్వాత ఏ చిత్రాన్ని రీమేక్‌ చేయకూడదని. కానీ ఈ రెండు సినిమాల గురించి అప్పటికే నిర్ణయం తీసుకోవడం వల్ల వెనక్కి వెళ్లలేకపోయాం. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో 'గేమ్‌ ఛేంజర్‌' చేస్తున్నా. దీని తర్వాత ఎన్టీఆర్‌, ప్రభాస్‌లతో సినిమా చేస్తాను. అయితే.. వాళ్ల ప్రాజెక్టులు పూర్తైన తర్వాతే మా బ్యానర్​లో సినిమా ఉంటుంది" అని దిల్‌రాజు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:అఖిల్ 'ఏజెంట్'​-'పొన్నియిన్​​ సెల్వన్​ 2'.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

Last Updated : Apr 29, 2023, 7:12 PM IST

ABOUT THE AUTHOR

...view details