తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సినిమా షూటింగ్‌లు బంద్‌.. ఆ రోజే తుది నిర్ణయం' - undefined

తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై నిర్మాత సి.కల్యాణ్​ స్పందించారు. కొత్త సినిమాల నిర్మాణాన్ని ఆపే ఉద్దేశం తమకు లేదని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 23న జరిగే సమావేశంలో ఫిల్మ్‌ ఛాంబర్‌తో కలిసి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

kalyan
కల్యాణ్​

By

Published : Jul 21, 2022, 11:01 PM IST

కొత్త సినిమాల నిర్మాణాన్ని ఆపే ఉద్దేశం తమకు లేదని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తెలిపింది. టాలీవుడ్‌లో నెలకొన్న వివిధ సమస్యలపై ఈ నెల 23న జరిగే సమావేశంలో ఫిల్మ్‌ ఛాంబర్‌తో కలిసి తుది నిర్ణయం తీసుకుంటామంది. ఓటీటీల ప్రభావం, నిర్మాణ వ్యయం, సినిమా టికెట్‌ ధరలు.. తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని కొందరు నిర్మాతలు ఆగస్టు 1 నుంచి షూటింగ్‌లు నిలిపివేయాలని భావించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి గురువారం సమావేశమైంది. సమావేశం అనంతరం, నిర్మాత సి.కల్యాణ్‌ మీడియాతో మాట్లాడారు.

'సినిమాల కంటెంట్‌, ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా టికెట్‌ ధరలు, ఓటీటీల గురించి చర్చించాం. యూనియన్‌లు, ఫెడరేషన్‌, మేనేజర్‌ల పాత్ర, నటులు, సాంకేతిక నిపుణుల సమస్యల గురించీ మాట్లాడం. షూటింగ్‌లు నిలిపివేయాలా? వద్దా? కొత్త ప్రాజెక్టులు కాకుండా ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న వాటినే నిలిపివేయాలా?.. ఇలా అనే కోణాల్లో చర్చించాం. 23న జరిగే మీటింగ్‌లో తుది నిర్ణయం తీసుకుంటాం' అని కల్యాణ్‌ వివరించారు. ఈ సమావేశంలో దిల్‌ రాజు, ప్రసన్న కుమార్‌, జెమిని కిరణ్‌, ఠాగూర్‌ మధు, నట్టి కుమార్‌, అభిషేక్‌ అగర్వాల్‌, తమ్మారెడ్డి భరద్వాజ, బెక్కం వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఈ హీరోయిన్ల అసలు పేరు మీకు తెలుసా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details