Bandla Ganesh: సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని గత కొద్దిరోజులుగా సినీ పెద్దలు, నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. ఓటీటీలకు ప్రజలు అలవాటు పడిపోవడం వల్ల మూవీ కలెక్షన్స్ తగ్గిపోతున్నాయని అంటున్నారు. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించుకునేందుకు సినిమా షూటింగ్‌లను సైతం నిలిపివేశారు. అయితే ఈ వ్యవహారంపై తాజాగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేసి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
"సినిమా.. సినిమా.. నా జీవితం సినిమా.. నాకు ఇష్టమైన పదం సినిమా. నేను సినిమా కోసమే బతుకుతున్నా. ఈ మధ్య సినిమాలు ఆడటం లేదు. జనాలు థియేటర్స్‌కు రావడం లేదని చాలా మంది గగ్గోలు పెడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. వేరే భాష హీరో వచ్చి ఇక్కడ సూపర్ హిట్ కొట్టాడు. అలాగే మన హీరోలు నందమూరి కల్యాణ్ రామ్, నిఖిల్ తీసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే.. మంచి కథనంతో అద్భుతంగా సినిమా తెరకెక్కిస్తే.. ఎప్పుడైనా, ఏ కాలమైనా అలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు.. ఆనందిస్తారు.. ఆస్వాదిస్తారు."
-- బండ్ల గణేశ్, ప్రముఖ నిర్మాత