తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కూతురు గురించి తొలిసారి స్పందించిన ప్రియాంక చోప్రా - ప్రియాంక చోప్రా

బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా.. తన కూతురు గురించి తొలిసారి స్పందించారు. సరోగసి ద్వారా ఒక పాపకు జన్మనిచ్చారు ప్రియాంక. ఇంతకీ ఏం అన్నారంటే?

Priyanka
ప్రియాంక

By

Published : Apr 14, 2022, 11:00 PM IST

బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ స్టార్ నిక్​ను పెళ్లి చేసుకుని.. సరోగసి ద్వారా ఒక పాపకు జన్మనిచ్చారు. అయితే ఆమె తొలిసారి తన కూతురి గురించి స్పందించారు. తల్లిగా తాను ఏం చేయాలనుకుంటున్న దాని గురించి చెప్పుకొచ్చారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్లిన ప్రియాంకతో ఓ జర్నలిస్టు సంభాషించారు. ఈ సందర్భంగా ప్రియాంక తన కూతురు గురించి కోన్ని విషయాలు పంచుకున్నారు.

"ఓ తల్లిగా నా భయాలు, కలలను తన బిడ్డపై ఎట్టిపరిస్థితుల్లోనూ రుద్దను. పిల్లలు ఎప్పుడైనా మన ద్వారా మాత్రమే వస్తారు గానీ.. మన నుంచి రారు" అని చెప్పుకొచ్చారు ప్రియాంక

తల్లిదండ్రులు తనపై ఎప్పుడూ ఆధిపత్యం చూపించలేదని, స్వతంత్రంగా ఉండనిచ్చారని వివరించారు. ప్రియాంక చోప్రా తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే కావడం వల్ల.. ఆమె విషయంలో.. జాగ్రత్తగా అడుగులు వేశారు. తల్లి మధు చోప్రా, తండ్రి దివంగత అశోక్ చోప్రా ఇద్దరూ ఆర్మీలో వైద్యులుగా పనిచేశారు.

ABOUT THE AUTHOR

...view details