తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కారులో మంటలు.. ప్రియాంక చోప్రా కోస్టార్​కు తీవ్ర గాయాలు​! - అన్నే హెచేకు కారు ప్రమాదం

ఓ ప్రముఖ నటికి కారు ప్రమాదం తప్పింది. కానీ ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది.

Hollywodd Actress met with an car accident
మంటల్లో చికుక్కున్న కారు.. స్టార్​ నటికి తీవ్ర గాయాలు​

By

Published : Aug 6, 2022, 5:06 PM IST

ప్రముఖ హాలీవుడ్ నటి అన్నే హెచే తీవ్ర గాయాలపాలైంది. లాస్ ఏంజిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న 53 ఏళ్ల అన్నే హెచే గ్యారేజీ నుంచి తన బ్లూ మినీ కూపర్‌ కారును బయటకు తీసింది. ఈ క్రమంలోనే ఆ వాహనం అదుపుతప్పి ఓ ఇంటిని ఢీ కొట్టగా, కారు క్రాష్‌ అయి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు ఆమెను బయటకు తీసుకొచ్చి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఈలోపే ఆమెకు తీవ్ర గాయాలయ్యాలని తెలిసింది. ఆమె కారు క్రాష్‌కు గురైనప్పుడు స్థానికులు అక్కడ ఉండటం వల్లే ప్రమాదం నుంచి బయటపడగలిగారని అక్కడి వాళ్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అన్నే హెచే పరిస్థితి పర్వాలేదని తెలుస్తోంది.

కాగా, అన్నే హెచే అనెదర్‌ వరల్డ్‌ అనే టీవీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. 1987 నుంచి 1991 వరకు వచ్చిన ఈ షోలో విక్కీ హడ్సన్‌, మార్లే లవ్ అనే కవలలుగా నటించినందుకు గానూ ఎమ్మీ అవార్డ్ అందుకుంది. అలాగే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాతో కలిసి 'క్వాంటికో' సిరీస్‌లో స్క్రీన్‌ షేర్ చేసుకుంది. వీటితోపాటు డోనీ బ్రాస్కో, సిక్స్‌ డేస్‌ సెవెన్ నైట్స్, వాగ్‌ ది డాగ్‌ వంటి సినిమాలతో ఆకట్టుకుంది.

ఇదీ చూడండి: పవన్​పై నిర్మాత బండ్లగణేశ్ ట్వీట్​.. అలా చేయాలంటూ..

ABOUT THE AUTHOR

...view details