తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రభాస్​ కోసమే.. సినిమా ఒప్పుకున్న స్టార్​ ఎవరో తెలుసా? - సలార్ మూవీ అప్​డేట్స్

రెబల్​ స్టార్​ ప్రభాస్​ హీరోగా తెరకెక్కుతున్న పవర్‌ప్యాక్డ్​ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. ఈ సినిమాలో కీలక పాత్రలో మలయాళీ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్నారు. తాజాగా మలయాళీ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు పృథ్వీరాజ్‌.

Prithviraj has accepted the Salar movie only for Prabhas
ప్రభాస్​ కోసమే.. సినిమా ఒప్పుకున్న స్టార్​ ఎవరో తెలుసా?

By

Published : Apr 4, 2022, 9:19 PM IST

Updated : Apr 4, 2022, 11:08 PM IST

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తోన్న పవర్‌ప్యాక్డ్​ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. ప్రశాంత్‌నీల్‌ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మలయాళీ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్నారని ఇటీవల ప్రభాస్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో పృథ్వీరాజ్‌ పాత్ర ఎంతో కీలకంగా ఉండనుందట. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మలయాళీ పోర్టల్‌కు పృథ్వీరాజ్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘సలార్‌’ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనుకోని కారణాల వల్ల తాను ‘సలార్‌’ నుంచి తప్పుకొన్నానని.. ప్రభాస్‌ వల్లే తిరిగి చిత్రంలో భాగమయ్యానని అన్నారు.

‘‘ప్రశాంత్‌నీల్‌, హోంబలే ఫిల్మ్స్‌ సంస్థతో నాకు మంచి అనుబంధం ఉంది. ‘సలార్‌’ పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నప్పుడు గతేడాది ప్రశాంత్‌నీల్‌ నన్ను కలిశారు. ‘సలార్‌’లో ఓ కీలక పాత్ర ఉందని, చేయాలని కోరారు. కథ విన్నాను. ఆ పాత్ర నాకు బాగా నచ్చింది. దాంతో సినిమా చేస్తానని చెప్పాను. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్‌ వాయిదా పడటం, అదే సమయంలో నా కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కడంతో డేట్స్‌ సర్దుబాటు కాక సలార్‌’ చేయలేనని ప్రశాంత్‌తో చెప్పేశాను. ఆ తర్వాత ప్రభాస్‌, ప్రశాంత్‌ నన్ను కలిశారు. సినిమా చేయాలని కోరారు. నా ప్రాజెక్ట్ పూర్తైన వెంటనే ఆ సినిమాలో భాగమవ్వాలని నిర్ణయించుకున్నాను. అలా, నేను మళ్లీ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను’’ అని పృథ్వీరాజ్‌ చెప్పుకొచ్చారు. హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తోన్న ఈసినిమాలో శ్రుతిహాసన్‌ ముఖ్య భూమిక పోషిస్తున్నారు.

Last Updated : Apr 4, 2022, 11:08 PM IST

ABOUT THE AUTHOR

...view details