తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Gandeevadhari Arjuna Trailer : హాలీవుడ్ స్టైల్​లో వరుణ్ యాక్షన్ మోడ్​.. ఛేజింగ్-సస్పెన్స్​తో 'గాండీవధారి అర్జున' ట్రైలర్​

Gandeevadhari Arjuna Trailer : మెగా హీరో వరుణ్ తేజ్​ నటించిన 'గాండీవధారి అర్జున' ట్రైలర్ రిలీజై ఆకట్టుకుంటోంది. ప్రచార చిత్రం​ ఆద్యంతం.. యాక్షన్, ఛేజింగ్, ఎమోషన్స్, సస్పెన్స్​తో ఆకట్టుకుంది.

Gandeevadhari Arjuna Trailer : హాలీవుడ్ స్టైల్​లో వరుణ్ యాక్షన్ మోడ్​.. ఛేజింగ్-సస్పెన్స్​తో 'గాండీవధారి అర్జున' ట్రైలర్​
Gandeevadhari Arjuna Trailer : హాలీవుడ్ స్టైల్​లో వరుణ్ యాక్షన్ మోడ్​.. ఛేజింగ్-సస్పెన్స్​తో 'గాండీవధారి అర్జున' ట్రైలర్​

By

Published : Aug 10, 2023, 5:26 PM IST

Gandeevadhari Arjuna Trailer : చివరగా 'ఎఫ్ 3' చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న మెగాప్రిన్స్​ వరుణ్ తేజ్​.. ప్రస్తుతం వరసగా సినిమాలను లైనప్​లో పెడుతున్నారు. అలా ఇప్పటికే స్టైలిష్ అండ్ యాక్షన్ డైరెక్టర్​ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాండీవధారి అర్జున' అనే భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ సినిమా చేశారు. ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది.(varun tej gandeevadhari arjuna release date) విడుదల తేదీ దగ్గర పడటం వల్ల తాజాగా ట్రైలర్​ను విడుదల చేశారు మేకర్స్​. "డిసెంబర్​ 2020లో దేవుడు మీద మనిషి గెలిచాడట. జ‌స్ట్ పాతికవేల సంవ‌త్సరాల‌లో మ‌నిషి చేసిన వ‌స్తువులు దేవుడు చేసిన వాటిని మించేసాయంట. ఎలాగో తెలుసా..?" అంటూ నాజ‌ర్ సంభాషణలతో ప్రారంభమైన ట్రైలర్​ ఆద్యంతం.. యాక్షన్, ఛేజింగ్,ఎమోషన్స్, సస్పెన్స్​తో ఆకట్టుకుంది.

దేశ రక్షణ విషయంలో తలెత్తిన ఓ భారీ సమస్యను పరిష్కరించేందుకు సెక్యూరిటీ ఏజెంట్​ అర్జున్​గా వరుణ్ తేజ్​ యాక్షన్​ ఎంతో ఇంటెన్సివ్​గా ఉంది. ' క్లైంట్ అయినా సరే తప్పు చేస్తే చంపేస్తా..' 'ప్రపంచానికి నిజం తెలియాలి?' అంటూ వరుణ్​ డైలాగ్స్​ చెప్పడం వంటి బాగున్నాయి. ఆయన స్టెలిష్‌ లుక్స్‌ కూడా చాలా బాగున్నాయి. ఇక ప్రచార చిత్రం మధ్యలో మెడికల్ మాఫీయా, భారీ యుద్ధ పరికరాలు, తీవ్రవాదం వంటివి కూడా కాస్త చూపించారు. ఈ క్రమంలోనే 12 వేల మంది చనిపోయారంటూ అంటూ సంభాషణ రావడం ఆ తర్వాత దేశ రక్షణ కోసం వరుణ్​ పోరాడటం వంటివి ఇంట్రెస్టింగ్​గా సాగాయి. ఇంతకీ దేశానికి వచ్చిన ఆ పెద్ద సమస్య ఏంటి? అర్జున్​ దాన్ని పరిష్కరించేందుకు ఎలాంటి ఆపరేషన్​ చేపట్టాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేమిటి? వంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Praveen Sattaru Varun Tej Movie : ఇక ఈ ప్రచార చిత్రాన్ని దర్శకుడు ప్రవీణ సత్తార్ అద్భుతంగా కట్​ చేశారు.​ హాలీవుడ్ స్టైల్​లో ప్రతీ సన్నివేశంలో తన మార్క్​ టేకింగ్​ను బాగా చూపించారు. చివరిగా 'భూమికి పట్టిన అతి పెద్ద క్యాన్సర్​ మనిషేనేమో' అంటూ నాజర్ సంభాషణతో ప్రచార చిత్రాన్ని మూగించారు. మిక్కీ జె మేయర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ సినిమాలో సాక్షివైద్య కథానాయికగా కనిపించింది.

Varun tej gandeevadhari arjuna : వరుణ్​ క్లాసిక్ వింటేజ్​ కార్​.. దీని వెనక పెద్ద కథే ఉందిగా.. ఏంటో తెలుసా?

వరుణ్ - లావణ్య పెళ్లి.. ముహూర్తం ఫిక్స్... ఆ నెలలోనే !

ABOUT THE AUTHOR

...view details