Prashanth Neel Salaar Movie: తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్లో వచ్చిన 'లియో' సినిమా ప్రస్తుతం మిక్స్డ్ టాక్‌తో నడుస్తోంది. 'ఖైదీ', 'విక్రమ్' లాంటి హిట్ సినిమాలను అందించిన లోకేశ్ నుంచి అదే స్థాయిలో 'లియో' ఉంటుంది అని ఆశించారు. కానీ, అనుకున్నంత రేంజ్లో ఆ సినిమా ఆకట్టులేకపోయింది. మొదటి భాగం మెప్పించింది కానీ, సెకాండ్ హఫ్ మాత్రం నిరుత్సాహ పరిచిందంటూ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే కలెక్షన్ల విషయంలో మాత్రం దూసుకుపోతుంది. దీంతో రానున్న సినిమాలపై అభిమానుల దృష్టి పడింది.
'లియో' తర్వాత అంతటి అంచనాలను 'సలార్'పై పెట్టుకున్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల కానుంది. కేజీఎఫ్-1, 2 సినిమాలతో సూపర్ హిట్లు కొట్టిన ప్రశాంత్ నీల్.. పాన్ఇండియా డైరెక్టర్‌గా మారిపోయారు. దీంతో ఆయన తెరకెక్కిస్తున్న 'సలార్' సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అలానే 'బాహుబలి' తర్వాత అలాంటి హిట్‌ను ప్రభాస్ ఇంతవరకు అందుకోలేకపోయారు. అయితే ఈ సినిమానైన ఆ రేంజ్లో ప్రభాస్ హిట్ట్ కొట్టాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయటానికి ప్లాన్ చేశారు. తొలి పార్ట్‌ను డిసెంబర్ 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ అదే రోజు బాలీవుడ్లో 'డంకీ' సినిమా విడుదల కానుంది. రెండూ కూడా భారీ అంచానల నడుమ వస్తున్న సినిమాలు కావడం వల్ల బాక్సాఫీస్ వద్ద క్లాష్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు 'లియో' రిజల్ట్స్ చూసిన అభిమానులు 'సలార్' విషయంలో కొంచం భయపడుతున్నారు. ప్రశాంత్ నీల్ కూడా సినిమా విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.