Prashanth Neel About NTR: 'కేజీయఫ్'తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రభాస్‌తో 'సలార్' తెరకెక్కిస్తున్న ఆయన.. అనంతరం యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా (ఎన్టీఆర్31) చేయనున్నారు. ఏప్రిల్ 14న 'కేజీయఫ్2' విడుదల సందర్భంగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తారక్ గురించి తన అనుబంధాన్ని పంచుకున్నారు.
"జూనియర్ ఎన్టీఆర్‌కు 20 ఏళ్లుగా అభిమానిని. గత రెండేళ్లలో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. నేను చెప్పిన కథ అతడికి బాగా నచ్చింది. దానిపైనే ఇప్పుడు పనిచేస్తున్నాం. ఈ సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా."