తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Pranitha: తల్లికాబోతున్న నటి ప్రణీత - నటి ప్రణీత

Pranitha Subhash: ప్రముఖ హీరోయిన్​ ప్రణీత తాను తల్లి కాబోతున్నట్లు తెలిపారు. ఇన్​స్టా వేదికగా తన భర్తతో కలిసి దిగిన ఫొటోలు షేర్​ చేశారు. తన భర్త పుట్టిన రోజు నాడే దేవతలు అద్భుతమైన బహుమతి ఇచ్చారని పేర్కొన్నారు.

ss
ప్రణీత

By

Published : Apr 11, 2022, 12:57 PM IST

Pranitha Subhash: 'అత్తారింటికి దారేది'తో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన బాపుగారి బొమ్మ, నటి ప్రణీత గుడ్‌ న్యూస్ చెప్పారు. త్వరలో తాను తల్లి కాబోతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు ప్రణీత. భర్తతో కలిసి దిగిన ఫొటోలు షేర్‌ చేసిన ఆమె.. " నా భర్త 34వ పుట్టినరోజు నాడు.. దేవతలు మాకు అద్భుతమైన బహుమతి ఇచ్చారు" అని పేర్కొన్నారు.

ఇన్​స్టాలో షేర్​ చేసిన ప్రణీత లేటెస్ట్​ ఫొటో

ప్రణీత పెట్టిన పోస్ట్‌పై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు స్పందిస్తున్నారు. ఈ జంటకు అభినందనలు చెబుతూ కామెంట్స్‌ పెడుతున్నారు. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ప్రణీత పలు సినిమాల్లో నటించారు. 'అత్తారింటికి దారేది', 'రభస', 'పాండవులు పాండవులు తుమ్మెద', 'బ్రహ్మోత్సవం', 'హలో గురు ప్రేమకోసమే' చిత్రాలు నటిగా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కరోనా సమయంలోనూ పేదల కోసం ఆమె తనవంతు సాయం చేశారు. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజుని గతేడాదిలో వివాహం చేసుకున్నారు.

వ్యాపారవేత్త నితిన్‌ రాజుని వివాహమాడిన ప్రణీత

ఇదీ చూడండి:దర్శకుడితో సీక్రెట్​ రిలేషన్​షిప్​.. అబార్షన్​ చేయించుకున్న నటి

ABOUT THE AUTHOR

...view details