'ఆర్ఆర్ఆర్' సినిమాతో తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటారు దర్శకధీరుడు రాజమౌళి. ఈ సినిమా హిట్ కావడంలో భాగమైన డైరెక్షన్ టీమ్‌తో పాటు సహాయ సిబ్బందికి రాజమౌళి కాస్ట్లీ గిఫ్ట్‌లను అందజేశారట. అసిస్టెంట్స్ అందరికి ఖరీదైన ఐఫోన్లను బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. అలాగే ఈ సినిమా లైన్ ప్రొడ్యూసర్, కీరవాణి సతీమణి వల్లి కూడా తన అసిస్టెంట్స్ అందరికి నగదును బహుమతిగా అందించినట్లు సమాచారం.
సూర్య, జ్యోతికపై కేసు!
సూర్య హీరోగా తెరకెక్కిన 'జై భీమ్' చిత్రం ఎన్ని ప్రశంసలు అందుకుందో ఓ వర్గం నుంచి అదే స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. తమిళనాడుకు చెందిన వన్నియార్లు అనే కమ్యూనిటీని అవమానించారంటూ సినిమా విడుదల సమయంలో పీఎంకే నేత అన్బుమణి రామదాసు ఆరోపించగా, అదే సామాజిక వర్గానికి చెందిన 'రుద్ర వన్నియర్ సేన' గతేడాది నవంబరులో కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని కొన్ని సీన్లు తమ ప్రతిష్టను దెబ్బతిసేలా ఉన్నాయంటూ ఆ సేన పిటిషన్లో పేర్కొంది. గురువారం ఆ పిటిషన్‌ను విచారించిన సైదాపేట్ కోర్టు సూర్యతోపాటు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన సతీమణి జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. జస్టిస్ చంద్రు కెరీర్లో కీలకంగా నిలిచిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం నేరుగా ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై (2021 నవంబరు 2), విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఆస్కార్ పోటీల్లోనూ నిలిచింది.