తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆదిపురుష్​ కోసం ప్రభాస్​ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు' - డైరెక్టర్​ ఓంరౌత్​

Prabhas Adipurush: 'ఆదిపురుష్' సినిమా​ కోసం ప్రభాస్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని, విలువిద్యలోనూ శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్​. రాముడిగా సరిగ్గా సరిపోతారని పేర్కొన్నారు.

Adhipurush
ఆదిపురుష్​, ప్రభాష్​, ఔంరౌత్​

By

Published : Apr 4, 2022, 11:54 AM IST

Prabhas Adipurush: 'ఆదిపురుష్' సినిమా​ కోసం హీరో ప్రభాస్​ ఎంతో కష్టపడ్డారని చెప్పారు చిత్ర దర్శకుడు ఓంరౌత్​. ఆర్చరీలో కూడా శిక్షణ తీసుకున్నట్లు వెల్లడించారు.

"ఈ సినిమా కోసం ప్రభాస్​ చాలా సవాళ్లను ఎదుర్కొన్నారు. విలువిద్యలో శిక్షణ తీసుకున్నారు. సాధారణంగా దేహదారుఢ్యం 'వి' ఆకారంలో ఉంటుంది. భుజాలు విశాలంగా, నడుము భాగం వచ్చేసరికి సన్నగా ఉండటాన్నే వి షేప్ అంటారు. ప్రభాస్​ ఆ ఆకృతికి మారారు. అలాగే తెలుగు వెర్షన్​ కోసం సంస్కృత డైలాగ్స్​, హిందీ వెర్షన్​ కోసం హిందీ డైలాగ్స్​ స్పష్టంగా పలకడానికి బాగా సాధన చేశారు. మొత్తంగా ప్రభాస్​ చాలా కష్టపడ్డారు. ఆయనే రాముడిగా సరిగ్గా సరిపోతారు."

- ఓంరౌత్​, ఆదిపురుష్​ డైరెక్టర్​.

ఇక ఈ సినిమాలో సీత పాత్రలో కృతిసన్​న్​ నటించగా.. రావణుడిగా సైఫ్​ అలీఖాన్ నటిస్తున్నారు. లక్ష్మణుడి పాత్రలో సన్నీసింగ్​ కనిపించనున్నారు.

ఇదీ చూడండి:'ఆదిపురుష్'​ క్రేజీ అప్డేట్​.. తెలుగులోకి మలయాళీ క్లాసిక్!

ABOUT THE AUTHOR

...view details