Prabhas Upcoming Movies :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు 'బాహుబలి 2' తర్వాత ఒక్క భారీ హిట్ దక్కపోయినా.. ఆయన కొత్త సినిమాల లైనప్ మాత్రం ఎవరూ ఊహించని రేంజ్లో ఉంటున్నాయి. చకచకా సినిమాలను ఒప్పుకుంటూ వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తూ కెరీర్లో ముందుకెళ్లిపోతున్నారు. ఈ ఏడాది చివర్లో సలార్‌తో సినీప్రియుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. డిసెంబర్ 22న(Prabhas Salaar Release Date) ఈ చిత్రం గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. చాలా కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ప్రభాస్.. ఈ ఏడాది కచ్చితంగా హిట్‌తో ముగిస్తారని అభిమానులంతా బలంగా నమ్ముతున్నారు.
Prabhas Upcoming Movies : మరో రెండు కొత్త ప్రాజెక్ట్‌లకు ప్రభాస్ గ్నీన్ సిగ్నల్.. దర్శకులు ఎవరంటే? - ప్రభాస్ హను రాఘవపూడి సినిమా
Prabhas Upcoming Movies : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో రెండు కొత్త సినిమాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఆ వివరాలు..
Published : Sep 30, 2023, 11:00 PM IST
అయితే ఇప్పుడు ప్రభాస్ గురించి మరో శుభవార్త అందింది. అదేంటంటే.. ఆయన మరో రెండు కొత్త ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. రెండు కథలను లైన్లో పెట్టినట్లు సమాచారం అందింది. ఇప్పటికే ఆయన సూపర్ హిట్ ఫిల్మ్ సీతారమం ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపూడితో ఓ చిత్రం చేయబోతున్నట్లు, అది వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు ప్రచారం సాగింది. అంతలోనే మళ్లీ ఇప్పుడు ప్రభాస్ మరో రెండు కొత్త కథలను కూడా లాక్ చేసినట్లు కొత్త వార్తలు షికార్లు కొడుతున్నాయి.
ఇద్దరు పెద్ద దర్శకులతో ఈ సినిమాలు చేయనున్నారట. అయితే వారెవరో ఇంకా పేర్లు తెలియలేదు. కానీ త్వరలోనే వీటి గురించి అధికారికంగా ప్రకటన రాబోతుందని చెబుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాగ్ అశ్విన్ కల్కి, మారుతి చిత్రాలు ఉన్నాయి. అవి ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అయితే ప్రభాస్ కొత్త చిత్రాలను లైనలో పెట్టారనే విషయం తెలుసుకుంటున్న ఆయన ఫ్యాన్స్.. తెగ సంతోష పడిపోతున్నారు. ఈ విషయాన్ని నెట్టింట్లో షేర్ చేస్తూ ఆ బడా డైరెక్టర్స్ దర్శకులు ఎవరై ఉంటారా అని తెగ ఆరా తీస్తున్నారు. చూడాలి మరి ఆ డైరెక్టర్ ఎవరో? ప్రభాస్ ఎలాంటి కథలకు ఓకే చెప్పారో అనేది..