Prabhas Spirit Movie Update :బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ - సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగ కాంబోలో 'యానిమల్' సినిమా తెరకెక్కింది. నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. డిసెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా.. మూవీటీమ్ తెలుగు టాక్ షో అన్‌స్టాపబుల్‌లో సందడి చేసింది. హీరో రణ్‌బీర్, హీరోయిన్ రష్మిక, దర్శకుడు సందీప్‌రెడ్డి ఈ షో లో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో సందీప్ వంగ, 'స్పిరిట్' సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు.
ప్రోగ్రామ్ హోస్ట్ నందమూరి బాలకృష్ణ, సందీప్‌ను స్పిరిట్ ఎప్పుడమ్మా? అని అడగ్గా.. 2024 సెప్టెంబర్‌లో స్టార్ట్ అవుతుదంటూ ఆయన సమాధానమిచ్చారు. ఇక దర్శకుడు సందీప్ తెలుగులో తీసే సినిమాల్లో నటించడానికి ఇష్టపడతానని హీరో రణ్‌బీర్ అన్నారు. 'సందీప్ నెక్ట్స్ ఫిల్మ్ ప్రభాస్ అన్నతో ఉంది. అందులో నాకు చిన్న రోల్ ఇస్తే నేను నటించడానికి సిద్ధం' అని అన్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ఫుల్ ఎపిసోడ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' లో నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక డైరెక్టర్ సందీప్‌రెడ్డి.. 'యానిమల్' సినిమా ట్రైలర్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ఇండస్ట్రీల్లో వైలెన్స్ మాస్కు కేరాఫ్ అడ్రస్ అయ్యారు సందీప్. ట్రైలర్ ఎఫెక్ట్‌తో హైదరాబాద్‌లో ప్రీ బుకింగ్స్ కూడా ఊపందుకున్నాయట.