తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రభాస్​ 'స్పిరిట్' మూవీ సూపర్​ అప్డేట్​​.. 'పోలీస్'​గా డార్లింగ్​.. ఫ్యాన్స్​కు పండగే! - ప్రభాస్‌ మూవీస్ లేటెస్ట్ అప్​డేట్ న్యూస్

టాలీవుడ్​ స్టార్​ హీరో ప్రభాస్‌ కథానాయకుడిగా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కించనున్న 'స్పిరిట్‌' సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. డార్లింగ్​ తొలిసారి పోలీస్​ పాత్రలో నటించనున్నారు. ఆ సంగతులు..

Prabhas spirit movie latest update
ప్రభాస్

By

Published : Jan 16, 2023, 2:57 PM IST

'అర్జున్​ రెడ్'డి సినిమాతో యూత్​ నుంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. పాన్​ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్. వీరిద్దరి కాంబినేషన్​లో గతంలో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. 'స్పిరిట్' పేరుతో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత భూషణ్‌కుమార్‌ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

"ప్రస్తుతం సందీప్‌రెడ్డి 'యానిమల్‌' సినిమా షూటింగ్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ప్రభాస్‌ సినిమా 'స్పిరిట్‌' పనులు మొదలుపెడతారు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా షూటింగ్‌ మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. పోలీస్‌ డ్రామాగా తెరకెక్కనుంది. ఇందులో ప్రభాస్‌ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారు. అలాగే ఈ సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రం గురించి ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని చూస్తారు" అని భూషణ్‌ కుమార్‌ చెప్పారు. ఈ వార్త విన్న ప్రభాస్‌ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అప్‌డేట్స్‌ త్వరగా ఇవ్వాలంటూ సోషల్‌మీడియాలో సందడి చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం సందీప్‌ వంగా బాలీవుడ్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్‌తో బీటౌన్‌లోకి అడుగుపెట్టిన ఈ డైరెక్టర్‌ అక్కడ బిజీ అయ్యారు. 'యానిమల్‌' పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. రణ్‌బీర్‌కపూర్‌ ప్రధానపాత్రలో ఈ సినిమా రూపొందుతోంది. ఇటు ప్రభాస్‌కు కూడా చేతినిండా సినిమాలున్నాయి. ప్రశాంత్‌నీల్‌తో 'సలార్‌', నాగ్‌ అశ్విన్‌తో 'ప్రాజెక్ట్‌ కే' చేస్తున్నారు. వీటితోపాటు ఓం రౌత్‌ దర్శకత్వంలో 'ఆదిపురుష్‌'లో నటిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details