Prabhas Spirit Character :రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సలార్' సక్సెస్‌ను ఆస్వాదిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నారు. తన నటనతో ఇటు టాలీవుడ్లోనే కాకుండా అటు బాలీవుడ్‌లోనూ ప్రశంసలు అందుకుంటున్నారు. దీంతో అభిమానుల్లో ఆయన అప్‌కమింగ్ మూవీస్‌పై ఆసక్తి నెలకొంది. అందులో ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉండనుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. ఇప్పటికే నాగ్అశ్విన్ తెరకెక్కిస్తున్న 'కల్కి 2898 ఏడీ'లో ప్రభాస్ ఓ స్ట్రాంగ్ రోల్లో కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ ద్వారా ఆయన క్యారెక్టర్ ఎలా ఉండనుందో అందరికీ తెలిసింది.
అయితే యానిమల్ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి 'స్పిరిట్' అనే సినిమాను తెరకెక్కించనున్నారు. అందులో ప్రభాస్ లీడ్ రోల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఓ సాలిడ్ అప్డేట్ను సందీప్ సోదరుడు నిర్మాత ప్రణయ్ రెడ్డి ఇచ్చారు.
"ప్రభాస్ తన కెరీర్‌లోనే మొదటి సారి పోలీస్ డ్రెస్‌లో కనిపించనున్నారు. సందీప్ గత సినిమాల్లో హీరోల క్యారెక్టర్ ఎలా ఉంటుందో స్పిరిట్ సినిమాలోనూ ప్రభాస్ పాత్ర అలానే ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఆయన ఓ యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా కనిపిస్తారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి హీరోకు సంబంధించిన విషయాలు మాత్రమే నేను చెప్పగలను" అంటూ డార్లింగ్ ఫ్యాన్స్‌కు హింట్ ఇచ్చారు. ఇది విన్న ఫ్యాన్స్ ఈ సినిమా తదుపరి అప్డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ స్పిరిట్ లుక్ చూసేందుకు వెయిట్ చేస్తున్నారు.