Prabhas Salaar release date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రోజు వచ్చేసింది. ఆయన హీరోగా నటిస్తోన్న 'సలార్' టీమ్ నుంచి సరికొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేసింది. టీమ్ ఇచ్చిన అప్‌డేట్‌తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 'సలార్ ఆగమనం' అనే ట్యాగ్ సోషల్‌మీడియా ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. 'అన్న వస్తుండు..' అంటూ అభిమానులు సందడి చేస్తున్నారు.
ప్రభాస్ సలార్ రిలీజ్ డేట్ ఫిక్స్, ఫుల్ జోష్లో ఫ్యాన్స్ - సలార్ రిలీజ్ డేట్ వచ్చేసింది
ప్రభాస్ నటిస్తున్న 'సలార్' రిలీజ్ డేట్ ఖరారైపోయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేసింది.
ప్రభాస్ సలార్ రిలీజ్ డేట్
'రాధేశ్యామ్' తర్వాత ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకుడు. కమర్షియల్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది సిద్ధమవుతోంది. ఇందులో ప్రభాస్ కొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నారు. శ్రుతిహాసన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ దీన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతోంది.
ఇదీ చూడండి: డింపుల్ హయతి గార్జియస్ లుక్స్ చూస్తే మతిపోతుందబ్బా