Prabhas Salaar sequel: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమాల్లో 'సలార్' ఒకటి. రూ.200కోట్లకు పైగా బడ్జెట్‌తో 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో డార్లింగ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. ఇప్పటివరకు 30శాతం చిత్రీకరణ పూర్తైంది. ఈ చిత్రంలోని పోస్టర్లు ఇప్పటికే అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రం కూడా 'కేజీఎఫ్' తరహాలోనే రెండు భాగాలుగా రానుందని సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రచారం సాగుతోంది. గతంలోనే దీన్ని చిత్రబృందం ఖండించింది. అయితే ఈ ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా 'కేజీఎఫ్ 2' ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రశాంత్ నీల్ 'సలార్' సీక్వెల్‌పై మరోసారి స్పష్టతనిచ్చారు. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని చెప్పారు.
'సలార్'కు సీక్వెల్.. ప్రశాంత్ నీల్ ఈ సారి ఏమన్నారంటే? - ప్రభాస్ సలార్ సీక్వెల్ దర్శకుడు ప్రశాంత్ నీల్
Prabhas Salaar sequel: ప్రభాస్ 'సలార్' రెండు భాగాలుగా రూపొందనుందని వస్తున్న వార్తలపై స్పందించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే..
Salaar sequel
"రెండు భాగాలుగా తెరకెక్కించాలని ప్రస్తుతం ఏమీ సన్నాహాలు చేయట్లేదు. ప్రభాస్‌తో ఈ విషయం గురించి చర్చిస్తున్నాను. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు దాని గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతానికైతే సింగిల్ పార్ట్ సినిమాగానే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం" అని ప్రశాంత్ అన్నారు. ఇక ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇదీ చూడండి: ఫారెన్‌లో బన్నీ గ్రాండ్ పార్టీ.. రొమాంటిక్‌గా శౌర్య.. 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్స్