తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రభాస్​ ఫ్యాన్స్​కు దెబ్బ మీద దెబ్బ.. 'స‌లార్' గ్లింప్స్‌ కూడా.. - కేజీఎఫ్​ 2

Prabhas Salar update: ప్రభాస్​ నటిస్తున్న 'సలార్' సినిమా గ్లింప్స్​.. 'కేజీఎఫ్​ 2' సినిమాకు జత చేసి విడుదల చేస్తారని ప్రచారం సాగింది. అయితే అది నిజం కాదని మేకర్స్ స్పష్టం చేశారు. త్వరలోనే దానిపై అప్డేట్​ ఇస్తామని తెలిపారు.

Prabhas Salaar update
Prabhas Salaar update

By

Published : Apr 10, 2022, 11:02 AM IST

Prabhas Salar update: పాన్​ఇండియా స్టార్​ ప్రభాస్‌ ఫ్యాన్స్​కు నిరాశపరిచే వార్త మరొకటి బయటకు వచ్చింది. ఇప్పటికే 'ఆదిపురుష్'​ అప్డేట్​ విషయంలో హర్ట్​ అయిన అభిమానులకు 'సలార్' విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన నటిస్తున్న సినిమాల్లో పవర్‌ప్యాక్డ్​ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'సలార్‌' ఒకటి. సెన్సేషనల్ డైరెక్టర్​ ప్రశాంత్ నీల్​ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. కొద్ది రోజుల నుంచి ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్​ న్యూస్​ వైరల్​ అవుతోంది. ఈ మూవీ నుంచి ఓ సాలిడ్​ గ్లింప్స్​ను రిలీజ్ చేయాలని మేకర్స్​ భావిస్తున్నారని ప్రచారం సాగింది. ఈ గ్లింప్స్​ను 'కేజీఎఫ్ చాప్ట‌ర్‌-2'తో జ‌త చేసి విడుదల చేస్తారని టాక్ వినిపించింది.

అయితే 'కేజీఎఫ్​ 2' ప్రమోషన్స్​లో పాల్గొన్న చిత్రబృందం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. అది నిజం కాదని నిర్మాతలు స్పష్టతనిచ్చారు. " కేజీఎఫ్ చాప్టర్ 2 చివరిలో సలార్ గ్లింప్స్ ప్లే చేస్తారనే రూమర్​ పూర్తిగా తప్పు. సలార్ గురించి ప్రకటించడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాం" అని అన్నారు.

ఇదీ చూడండి: 'ఆదిపురుష్'​పై దర్శకుడు ఓం రౌత్ స్పెషల్​​ ట్వీట్​.. ఫ్యాన్స్​ ఫైర్​

ABOUT THE AUTHOR

...view details