ఇద్దరు స్టార్ హీరోలు.. ఇద్దరివీ భారీ అంచనాలున్న సినిమాలే.. అంతకుమించిన యాక్షన్ ఘట్టాలు.. ఆ ఇద్దరు ఎవరో కాదు 'హరిహర వీరమల్లు'గా రానున్న పవన్ కల్యాణ్, సలార్‌గా అలరించనున్న ప్రభాస్. ఈ ఇద్దరి సినిమాల చిత్రీకరణలకు రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికైంది.
ప్రత్యేక సెట్లో 'సలార్'..
కేజీఎఫ్ చిత్రాల భారీ విజయం తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా అంటే బాగా క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'సలార్'. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన బస్తీ సెట్లో జరుగుతోంది. ప్రభాస్‌తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరికొన్ని రోజులు ఇక్కడే షూటింగ్ చేయనున్నారు. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.