సోషల్ మీడియాలో రోజు ఏదో ఒక దాని గురించి ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అందులో ఎంటర్టైన్మెంట్ కూడా ఒకటి. సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా గురించి చిన్న అప్డేట్ వచ్చినా, తమ అభిమాన హీరోహీరోలకు సంబంధించిన వార్తలు వచ్చినా.. అలా ఏదో ఒకటి ట్రెండ్ చేస్తూనే ఉంటారు. మరి నేడు(జూన్ 20) సినిమాకు సంబంధించి ట్రెండ్ అయిన టాప్ విశేషాలేంటో చూద్దాం..
Megaprince : మీమ్స్‌తో మెగాప్రిన్స్ సందడి.. రామ్‌చరణ్-ఉపాసన దంపతులు మంగళవారం తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో 'మెగా ప్రిన్సెస్' వచ్చేసిందంటూ సోషల్‌మీడియాలో ఫుల్ ట్రెండ్ చేస్తన్నారు. చిరంజీవిని కోట్ చేస్తూ 'బాసు పార్టీ లేదా' అని కొందరు అంటుంటే.. మరికొందరు 'ది లయన్ కింగ్'లో బేబీని పరిచయం చేసే సీన్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. ఇంకొందరు.. అల్లు అర్జున్ తనయుడిని అయాన్‌ను కోట్ చేస్తూ గంగోత్రి సినిమాలోని సీన్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. అలా ఆ సరదా మీమ్స్.. కడుపుబ్బా నవ్విస్తున్నాయి.
Pooja hegdey Gunturu karam : గందరగోళంలో గుంటూరు కారం.. 'గుంటూరు కారం'లో హీరోయిన్గా నటిస్తున్న పూజా హెగ్డే తప్పుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆమె ప్లేస్‌లో సంయుక్త మేనన్‌ను తీసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కొన్ని కారణాలతో షూటింగ్ షెడ్యూల్స్ మారుతూ వస్తున్నాయి. కథ మారిందంటూ, షూట్ చేసిన కొన్ని సీన్స్ రీషూట్ చేస్తున్నట్లు, సంగీత దర్శకుడు తమన్‌ను తప్పిస్తున్నట్లు ఇలా పలు రకాలు రూమర్స్ వస్తున్నాయి. అయితే తమన్ మాత్రం తన విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే ఇప్పటికే రిలీజ్ డేట్స్ కూడా నాలుగు మారాయి. సినిమా రిలీజ్‌కు ఇంకా ఆరు నెలలే సమయం ఉంది. కానీ ఇంకా సినిమాలో నటించే నటులు, టెక్నిషియన్స్‌పై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉండే సరికి ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు దర్శకుడు ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ మధ్యలో షెడ్యూల్స్‌ను పోస్ట్ పోన్ చేస్తూ పవన్ సినిమాలు(బ్రో, సుధీర్ వర్శ మూవీ)కు పనిచేస్తుండటం మహేశ్ అభిమానులకు నచ్చట్లేదు. మొత్తంగా సినిమా గురించి గందరగోళ పరిస్థితి నడుస్తోంది.