Prabhas Role in Salaar :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'సలార్: పార్ట్-1 సీజ్‌ఫైర్'. తాజాగా విడుదలైన టీజర్.. ఆడియెన్స్‌కు గూస్బంప్స్ తెప్పించగా.. సలార్ గురించి నెట్టింట చక్కర్లు కొడుతున్న పలు వార్తలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే పెంచుతున్నాయి. దీంతో ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమా విడుదల కోసం అటు డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 'సలార్'కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రభాస్ అభిమాని ఒకరు.. 'సలార్' సెట్‌లో తాను చూసిన విషయాన్ని మీడియాకు వివరించారు. అది విన్న ఫ్యాన్స్ ఇక సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఆ అభిమాని చెప్పిన మాటలను నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు.
ప్రశాంత్ నీల్ చిన్న సన్నివేశాన్ని కూడా చాలా క్షుణ్నంగా పరిశీలించి తీస్తున్నారని.. సీన్ బాగా వచ్చే వరకు ఎక్కడా రాజీ పడటం లేదని తెలిపారు. అలాగే సినిమాలో ఓ భారీ యాక్షన్ సీన్ కూడా ఉంటుందని అందులో ప్రభాస్ సుమారు 1000 మందితో ఫైట్ చేస్తారని చెప్పారు. అదే సమయంలో మరో పాత్రలో ఉన్న ప్రభాస్ కూడా ఆ సీన్లోకి ఎంట్రీ ఇస్తారని వెల్లడించారు. ఈ సన్నివేశం షూటింగ్ చూసి తాను ఆశ్చర్యపోయినట్లు ఆ అభిమాని తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సీన్‌ను స్క్రీన్‌పై చూస్తామో అంటూ ఆశభావం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఇక ఈ సినిమా నిర్మాత (హోంబలే ఫిల్మ్స్) కూడా ఓ మీడియా సంస్థతో 'సలార్' క్లైమాక్స్ గురించి మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా పతాక సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని.. కచ్చితంగా అవి ఒక బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేస్తాయంటూ ఆయన వివరించారని అప్పట్లో వార్తలు వినిపించాయి.