తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నా పెళ్లి గురించి అప్పుడే చెబుతా: ప్రభాస్​ - prabhas marriage

రెబల్​ స్టార్​ ప్రభాస్‌ తన పెళ్లిపై మరోసారి స్పందించారు. రాధేశ్యామ్‌ విడుదల సందర్భంగా ప్రేమ విషయంలో తన అంచనాలు తప్పాయని ఈ హీరో చెప్పడం చర్చనీయాంశమైంది. తాజాగా రెబల్‌ స్టార్‌కు పెళ్లి గురించిన ప్రశ్న మళ్లీ ఎదురైంది.

Prabhas
ప్రభాస్‌

By

Published : Apr 16, 2022, 10:34 PM IST

Updated : Apr 16, 2022, 10:50 PM IST

టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌గా పేరున్న ప్రభాస్‌ పెళ్లి వార్త ఎప్పుడూ హాట్‌ టాపిక్‌గానే మారుతుంది. బాహుబలి తర్వాత ఈ హీరోకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డ విషయం తెలిసిందే. ప్రభాస్‌ పెళ్లి కోసం వారంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల రాధేశ్యామ్‌ విడుదల సందర్భంగా ప్రేమ విషయంలో తన అంచనాలు తప్పాయని ఈ హీరో చెప్పడం చర్చనీయాంశమైంది. తాజాగా మరో సారి ఈ రెబల్‌ స్టార్‌కు పెళ్లి గురించిన ప్రశ్న ఎదురైంది.

'ప్రభాస్‌ మీ పెళ్లెప్పుడు?'అంటూ ఓ ఇంటర్వ్యూలో అడగగా ఎప్పటిలాగే చిలిపి సమాధానంతో దాటవేశాడు. 'దానికి నా దగ్గర ఇప్పుడు సమాధానం లేదు. నాకు తెలిసినప్పుడు అందరికీ చెప్తాను'అంటూ నవ్వేశాడు. 'ఎక్కడకు వెళ్లినా మీ పెళ్లి గురించే అడుగుతుంటారు. అది మీకు చిరాకు తెప్పించదా?'అనే మరో ప్రశ్నకుస్సందిస్తూ.. 'లేదు నాకెప్పుడూ చిరాకు అనిపించదు. నేను అర్థం చేసుకోగలను వారు నా గురించి ఎంతలా ఆలోచిస్తారో అని.. అయినా అలా అడగడం సాధారణ విషయమే. వారి స్థానంలో నేనున్నా అలానే ఆలోచిస్తా'అంటూ కూల్‌గా రిప్లై ఇచ్చాడు. కేజీయఫ్-2 తరవాత ప్రశాంత్‌ నీల్- ప్రభాస్‌ కలయికలో 'సలార్‌' తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను హోంబళే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.

Last Updated : Apr 16, 2022, 10:50 PM IST

ABOUT THE AUTHOR

...view details