Prabhas Record: 'బాహుబలి' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్. ఈ సినిమాతో రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మారారు. బాహుబలి చిత్రం తర్వాత వచ్చిన 'సాహో', 'రాధేశ్యామ్' చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోయాయి. రెండు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు రావడంతో డార్లింగ్ ఆశలన్నీ 'ఆదిపురుష్' సినిమాపైనే ఉన్నాయి. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని మొదట సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇటీవలే రిలీజైన టీజర్‌కు మిశ్రమ స్పందన రావడంతో మేకర్స్ వీఎఫ్‌ఎక్స్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఈ చిత్రాన్ని సమ్మర్‌కు వాయిదా వేశారు.
మోస్ట్ పాపులర్ టాలీవుడ్ స్టార్‌గా ప్రభాస్.. తర్వాత స్థానాల్లో ఎవరు ఉన్నారంటే? - ప్రభాస్ వార్తలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో అరుదైన రికార్డ్ సృష్టించారు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్.. నిర్వహించిన మోస్ట్ పాపులర్ మేల్ తెలుగు ఫిల్మ్ స్టార్స్ సర్వేలో టాప్ ప్లేస్‌లో నిలిచారు. తర్వాత స్థానాల్లో ఎవరెవరు ఉన్నారంటే?
ఇదిలా ఉంటే ప్రభాస్ తాజాగా మరో అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతినెల దేశంలోని సెలబ్రిటీల గురించి సర్వే నిర్వహించి.. టాప్ పొజిషన్‌లో ఉన్న సెలబ్రెటీల జాబితాలను విడుదల చేస్తుంటుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ మేల్ తెలుగు ఫిల్మ్ స్టార్స్ సర్వే జాబితాను ఆర్మాక్స్ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో ప్రభాస్ టాప్ ప్లేస్‌లో నిలిచారు. ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్, అల్లుఅర్జున్, మహేశ్‌బాబు తరువాత స్థానాల్లో ఉన్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా ప్రభాస్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఇక హీరోయిన్‌లలో సమంత మొదటి స్థానంలో ఉండగా కాజల్ రెండవ స్థానంలో ఉన్నారు..