తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ప్రాజెక్ట్​ కె'.. ఆ సూపర్ హిట్​ వెబ్​ సిరీస్​ కథలా ఉంటుందా?

Prabhas Project K story : ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' సినిమా స్టోరీ.. ఆ మధ్యలో విడుదలైన ఓ వెబ్​ సిరీస్ కథలా ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు..

Prabhas Project k
'ప్రాజెక్ట్​ కె'.. ఆ సూపర్ హిట్​ వెబ్​ సిరీస్​ కథలా ఉంటుందా?

By

Published : Jul 3, 2023, 1:28 PM IST

Prabhas Project K story : పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో రూపొందుతున్న సూపర్‌ హీరో సినిమా 'ప్రాజెక్ట్‌ కె' ఒకటి. 'మహానటి' డైరెక్టర్​​ నాగ్ అశ్విన్‌ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్​ బిగ్​ బీ అమితాబ్‌ బచ్చన్‌, హిందీ హాట్ అండ్​ బ్యూటీ హీరోయిన్లు దీపికా పదుకొణె, దిశా పటానీ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రంలోని పాత్రలను.. ఇతిహాస ఆధారిత పాత్రల స్ఫూర్తితో తీర్చిదిద్దుతున్నారని చాలా కాలంగా అందరూ అంటున్నారు.

prabhas project k movie : అలానే తాజాగా ప్రభాస్ పాత్రకు సంబంధించి కూడా ఓ వార్త వైరల్​ అయింది. ఈ సినిమాలో ప్ర‌భాస్.. భవిష్యత్​లో చెడును అంతం చేసేందుకు విష్ణు దేవుడు అవ‌తారమెత్తబోయే 'కల్కి' పాత్ర తరహాలో ఉంటుందని అంటున్నారు. హై టెక్నాలజీ సాయంతో ప్రభాస్​ను కల్కి పాత్రలో చూపిస్తారని చెప్పుకుంటున్నారు.

ఇప్పుడు ప్రభాస్​ పాత్ర గురించి వార్త రాగానే మరో ప్రచారం తెరపైకి వచ్చింది. 'ప్రాజెక్ట్​ కె'ను ఓ క్రైమ్ థ్రిల్లర్​ వెబ్​సిరీస్​తో పోలుస్తున్నారు. 'అసుర్'​ అనే వెబ్​ సిరీస్​ కథ తరహాలో ప్రాజెక్ట్ కె చిత్ర కథాంశం ఉంటుందట. మైథాలజీ నేపథ్యంలో క్రైమ్​ థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్​లో అర్షద్​ వార్సి, బరున్ సోబ్టి ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో ఫారెన్సిక్​ ఎక్స్​పర్ట్స్​.. తనను తాను అసురకాళీగా భావించే ఓ అత్యంత కిరాతకుడు సీరియల్ కిల్లర్​ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే 'ప్రాజెక్ట్​ కె'లోనూ ప్రతినాయకుడిగా కనిపించబోయే యూనివర్సల్​ స్టార్​ కమల్​హాసన్ పాత్ర​ కూడా.. ఇలా అసుర కాళీ తరహాలో ఉంటుందని చెబుతున్నారు. కమల్​ చేయబోయే వినాశనాన్ని అంతం చేసేందుకు.. ప్రభాస్​ విష్ణు అవతారమైన కల్కిగా కనిపిస్తారని ప్రచారం చేస్తున్నారు.

రెండింటికి పోలీక ఎలా? ప్రభాస్​ పాత్ర.. ఇతిహాసాల ఆధారంగా విష్ణు దేవుడి పాత్రకు అనుగుణంగా డిజైన్​ చేశారనేది సినీ వర్గాల ఇన్​సైడ్ టాక్​. అయితే 'ప్రాజెక్ట్ కె'కు.. 'అసుర'వెబ్​ సిరీస్​కు పోల్చడం అనేది కరెక్ట్​ కాదని ఇంకొంతమంది నెటిజన్ల అభిప్రాయం. ఎందుకంటే 'ప్రాజెక్ట్ కె'ను భారీ బడ్జెట్​తో.. అగ్రతారల, విజువల్స్​​ పెట్టి రూపొందిస్తున్నారు. దాని ఎగ్జక్యూషన్ మరోలా ఉండబోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. 'ప్రాజెక్ట్​ కె'ను మున్నపెన్నడు చూడని అతిపెద్ద భారీ సైన్స్​ ఫిక్షన్ విజువల్ వండర్​గా రూపొందిస్తున్నారు. 'అసరు' అనేది ఓ క్రైమ్​ థ్రిల్లర్​ మాత్రమే. కాబట్టి పోల్చకూడదు అని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాను వైజయంతీ మూవీస్​ బ్యానర్​పై అశ్వనీదత్​ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్​ అయ్యే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదీ చూడండి :

బడ్జెట్​@ 600 కోట్లు .. ఇక 'ప్రాజెక్ట్​-కె' స్టార్స్ రెమ్యూనరేషన్ ఎంతంటే ?

Kamal haasan project k : కమల్​హాసన్​పై ప్రభాస్​ కామెంట్స్​.. 'ఆయనకు నేనెవరో తెలీదంటూ..'

ABOUT THE AUTHOR

...view details