ఆదిపురుష్, సలార్ తర్వాత డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ప్రాజెక్ట్-కే. సుమారు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నరు. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన మిగతా షూటింగ్ కొద్ది నెలల్లో ముగుస్తుంది. సీజీ, పోస్ట్ ప్రొడక్షన్ మెరుపులన్నింటిని అద్దుకుని ఈ సినిమా 2024లో రిలీజ్‌కు సిద్ధం కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ ఇప్పుడు ఫ్యాన్స్‌ను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
రిలీజ్‌కు ముందే 'ప్రాజెక్ట్-కే' సంచలనాలు.. నిర్మాతకు కనక వర్షం!
నాగ్అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ప్రాజెక్ట్-కే. ఆదిపురుష్, సలార్ తర్వాత ప్రభాస్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ నయా అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేందంటే..
ఇప్పటికే ప్రాజెక్ట్-కే సినిమా రైట్స్‌ను కొనుక్కునేందుకు ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. ఇందులో భాగంగా సినిమా నైజాం హక్కులు (తెలంగాణ) రూ.70 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి. దీన్ని సునీల్ నారంగ్ అలియాస్ ఏషియన్ సునీల్ కొనుగోలు చేశారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ హక్కులు దాదాపు రూ. 100 కోట్లకు అమ్ముడవుతాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే రూ. 170 కోట్లు రాబట్టే అవకాశం ఉందని చిత్ర పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
తెలుగు సినిమా పరిశ్రమకు సుమారు 50 శాతం వసూళ్లు నైజాం ఏరియా నుంచే వస్తుంటాయి. కాగా, ఇటీవలే ప్రాజెక్ట్-కే మేకింగ్‌కు సంబంధించిన ఓ బిహైండ్ ద సీన్స్ వీడియోను మూవీ టీమ్ విడుదల చేసింది. సిరీస్‌గా విడుదలయ్యే ఈ వీడియోలకు 'ఫ్రమ్ ది స్క్రాచ్' అని నామకరణం చేశారు. న్యూ ఇయర్ ముందు వచ్చిన ఈ సిరీస్‌లోని ఫస్ట్ పార్ట్‌కు 'రీ-ఇన్వెంటింగ్ ది వీల్' అని పేరు పెట్టారు.