తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఇంటర్నేషనల్​ మార్కెట్‌ను టార్గెట్ చేసిన ప్ర‌భాస్‌.. పాట‌లు, కామెడీ లేకుండానే! - సలార్​ మూవీ రిలీజ్​ డేట్

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న 'సలార్'కు సంబంధించి క్రేజీ అప్డేట్​ వచ్చింది! ఈ మూవీని ఇంగ్లీష్‌లో కూడా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అందులో పాటలు ఉండవట.

prabhas prashanth neel salaar movie will release english version
prabhas prashanth neel salaar movie will release english version

By

Published : Mar 24, 2023, 8:42 AM IST

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ వరుస సినిమాలో బిజీగా ఉన్నారు. క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్​ సిగ్నల్ ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన సినిమాలు ఒకటి కాదు.. రెండు కాదు.. విడుదలకు నాలుగు చిత్రాలు సిద్ధంగా కానున్నాయి. వాటిలో సలార్​ ఒకటి. ఈ మూవీపై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్​ ఫేమ్​ ప్రశాంత్​ నీల్​.. ఈ సినిమాకు డైరెక్ట్​ చేస్తుండడమే కారణం. కేజీఎఫ్​తో పాన్​ ఇండియా మార్కెట్​లో సంచలనం సృష్టించారు ప్రశాంత్​ నీల్. దీంతో అందరూ సలార్​ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా సలార్​ మూవీ మేక‌ర్స్ కీలక నిర్ణ‌యం తీసుకున్నారట. మ‌న ఇండియన్ లాంగ్వేజెస్‌లోనే కాకుండా స‌లార్ ఇంగ్లీష్ వెర్ష‌న్‌ను సిద్ధం చేస్తున్నార‌ట‌. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్క‌ెట్‌ను టార్గెట్ చేస్తున్నారట. మ‌న ఇండియాలో విడుద‌లయ్యే వెర్ష‌న్‌లో ఉండే పాట‌లు, కామెడీ స‌న్నివేశాలు లేకుండా స‌లార్ ఇంగ్లీష్ వెర్ష‌న్‌ను సిద్ధం చేస్తున్నార‌ట‌. దీని వ‌ల్ల ఇంగ్లీష్ వెర్ష‌న్ వ్య‌వ‌ధి ముప్పై నిమిషాలు త‌గ్గనుందట.

భారీ చిత్రాలు నిర్మిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ త‌న‌దైన కోణంలో భారీ బ‌డ్జెట్‌తో స‌లార్ మూవీని నిర్మిస్తోంది. ఇందులో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌ల‌యాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార‌న్, జ‌గ‌ప‌తి బాబు విల‌న్స్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో కేజీఎఫ్​ స్టార్ యశ్​ గెస్ట్ రోల్ చేయనున్నార‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా వాయిస్‌తో ఎండ్ అవుతుందనే న్యూస్ కూడా వినిపిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు 28న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ , మలయాళ భాషల్లో సలార్​ రిలీజ్​ కానుంది.

స‌లార్ సినిమాతో పాటు హీరో ప్రభాస్​ నటించిన మ‌రో మూడు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇప్ప‌టికే ఆది పురుష్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన ప్ర‌భాస్.. ఇప్పుడు స‌లార్‌, ప్రాజెక్ట్-కె చిత్రాల‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. అలాగే మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా సెట్స్‌పై ఉంది. మరోవైపు, హోంబలే ఫిల్మ్స్​ ఉగాది రోజు.. కాంతార ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​ చెప్పింది. కాంతార-2 పనులు మొదలైనట్లు తెలిపింది. కాంతార ప్రీక్వెల్ రైటింగ్​ వర్క్స్​ మొదలైనట్లు ప్రకటించింది. ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details