సినిమాల్లో బిజీగా ఉంటూనే వ్యాపారాల్లో రాణిస్తుంటారు మన సినీ తారలు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇందుకు ఏ మాత్రం భిన్నం కాదు. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్.. తన సంపాదనలో కొంత మొత్తాన్ని ఇటలీలో పెట్టుబడులుగా పెట్టారని తెలిసింది. ఈ క్రమంలో ప్రభాస్ అక్కడ ఓ లగ్జరీ విల్లాను కూడా కొనుగోలు చేశారట. సినిమా షూటింగుల నుంచి విరామం దొరికినప్పుడు ప్రభాస్ తన స్నేహితులతో కలసి అక్కడకు వెళ్లి సరదాగా గడుపుతుంటారట. అక్కడి వాతావరణం, లొకేషన్లను ప్రభాస్ బాగా ఇష్టపడతారట.
అయితే ఇతర ప్రదేశాల్లో షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఇటలీలోని విల్లాను ప్రభాస్ అద్దెకు ఇస్తున్నారని సమాచారం. కాగా ఇటీవల ఆ విల్లాను ప్రభాస్.. విదేశీ టూరిస్ట్‌లకు, అక్కడి స్థానికులకు అద్దెకు ఇస్తున్నారట. ఆ విల్లాకు అద్దె రూపంలో నెలకు రూ. 40 లక్షల దాకా వస్తుందని తెలుస్తోంది.
కాగా ప్రభాస్ 'బాహుబలి' సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. అప్పటి నుంచి ఆయన సినిమాలు అన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలయ్యాయి. సాహో, రాధేశ్యామ్ సినిమాల ఫలితం ఏదైనా.. కలెక్షన్ల పరంగా మాత్రం ప్రభాస్ మార్క్‌ను పెంచాయి. తాజాగా రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో 'ఆదిపురుష్' పాన్ ఇండియా లెవెల్లో రూపుదిద్దుకుంది. రామాయణ ఇతిహాసంగా తెరకెక్కిన ఈ సినిమాపై పలు హిందూ సంఘాల నుంచి అభ్యంతరాలు తలెత్తాయి. సినిమాలో డైలాగులు, కొన్ని సన్నివేశాలు రామ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. వీటిపై స్పందించిన చిత్రబృందం అభ్యంతరకరంగా ఉన్న డైలాగులను తొలగించి రీ ఎడిట్ చేసిన వెర్షన్‌ను గరువారం నుంచి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి 'సలార్' సినిమా చేస్తున్నారు. కాగా ఈ చిత్రం నుంచి బుధవారం ఓ అప్డేట్ వచ్చింది. షూటింగ్ పనులన్నీ సవ్యంగా సాగితే.. వచ్చే వంద రోజుల్లో సినిమాను విడుదల చేస్తామని చిత్రయూనిట్ తెలిపింది.
కృతితో రిలేేషన్.?
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే గుర్తుకొచ్చే పేరు ప్రభాస్. ఆదిపురుష్ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఆ మధ్య కాలంలో ప్రభాస్, హీరోయిన్ కృతిసనన్‌తో రిలేషన్లో ఉన్నారంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ రూమర్స్‌ను వారిద్దరూ తిప్పికొట్టారు. కాగా ఇటీవలె తిరుపతిలో జరిగిన 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై ప్రభాస్ మాట్లాడుతుండగా.. పెళ్లి ఎప్పుడు అన్నా? అంటూ ఫ్యాన్స్ గోల చేశారు. దీనిపై ప్రభాస్ స్పందిస్తూ.. ఎప్పుడైనాగానీ ఇక్కడే (తిరుపతిలో) చేసుకుంటా అని ఆయన సమాధానం ఇచ్చారు.