Prabhas Nayanthara :తెలుగు చిత్రసీమలో ప్రభాస్-అనుష్క జోడీ ఎంత అందంగా అయితే ఉంటుందో ఆ తర్వాత ప్రభాస్-నయనతార జోడీకూడా అంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. గతంలో ప్రభాస్-నయనతార కాంబో.. యోగి చిత్రంలో కనిపించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగానే ఉంది. అయితే ఈ జంట మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది.
Prabash Kannappa :వివరాళ్లోకి వెళితే.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' రీసెంట్గా పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ పాన్ ఇండియా సినిమాను మోహన్‌బాబు, విష్ణు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ అతిథి పాత్రలో మెరవనున్నారని, అది కూడా శివుడి పాత్రలో కనిపించనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. మంచు విష్ణు కూడా ఓ ట్వీట్‌తో దీన్ని కన్ఫామ్ చేశారు.
అయితే ఇప్పుడిదే చిత్రంలో నయనతార నటించనుందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ప్రభాస్ శివుడి పాత్రకు జోడీగా పార్వతిగా కనిపించనుందని అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ప్రభాస్-నయనతార.. యోగి సినిమా తర్వాత అంటే దాదాపు 16ఏళ్ల తర్వాత కలిసి నటించినట్టవుతుంది. ఇకపోతే నయన్.. ఇప్పటికే పలు చిత్రాల్లో అమ్మవారిగా కనిపించి బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే కన్నప్ప చిత్రం.. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని రూపొందించనున్నారు. చిత్రాన్ని ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నట్లు ఆ మధ్య అనౌన్స్ చేశారు మేకర్స్. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్నారు. ఫారెన్‌లో ఈ మూవీ షూటింగ్ జరగనుంది.