తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'రాజాసాబ్​'గా ప్రభాస్- కొత్త లుక్​లో డార్లింగ్ అదుర్స్ - రాజాసాబ్ సినిమా అప్డేట్స్

Prabhas Maruthi Movie Update: పాన్ఇండియా స్టార్ ప్రభాస్- మారుతి సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్​ను మేకర్స్ సోమవారం రిలీజ్ చేశారు.

Prabhas Maruthi Movie Update
Prabhas Maruthi Movie Update

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 7:12 AM IST

Updated : Jan 15, 2024, 7:40 AM IST

Prabhas Maruthi Movie Update: రెబల్​స్టార్ ప్రభాస్- డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కనున్న సినిమా టైటిట్ ఖరారైంది. సంక్రాంతి కానుకగా నేడు (జనవరి 15) మూవీమేకర్స్ అఫీషియల్​గా టైటిల్ అనౌన్స్​ చేశారు. ఈ సినిమాకు 'రాజా సాబ్' అనే టైటిల్​ కన్ఫార్మ్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ భీమవరంలోని గ్రౌండ్స్​లో భారీ డిజిటల్ కటౌట్ (LED Screen) ఏర్పాటు చేశారు. ఈ డిజిటల్ కటౌట్​ ద్వారానే మేకర్స్ టైటిల్​ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్​ను లాంచ్​ చేశారు.

డార్లింగ్ డిజిటల్ కటౌట్:రాజాసాబ్మూవీమేకర్స్భీమవరం పందెంకోడి బారి గ్రౌండ్స్​లో భారీ డిజిటల్ కటౌట్​ ఏర్పాటు చేశారు. సోమవారం తెల్లవారుజాము నుంచే డార్లింగ్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో ఈ గ్రౌండ్స్​కు చేరుకున్నారు. ఉదయాన్నే టపాసులు కాల్చి సంబరాలు ప్రారంభించారు. కాగా, ఓ సినిమా అప్డేట్/ ఫస్ట్​ లుక్ పోస్టర్​ను డిజిటల్ కటౌట్​ ద్వారా లాంచ్ చేయడం టాలీవుడ్​లో చేయడం ఇదే తొలిసారి!

'డార్లింగ్', 'బుజ్జిగాడు' సినిమాల్లోలాగా వింటేజ్​ ప్రభాస్​ను 'రాజాసాబ్'​లో చూస్తారని దర్శకుడు మారుతి ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అందుకు తగ్గట్లుగా ఫస్ట్​ లుక్ పోస్టర్​లో ప్రభాస్ లుంగిలో కనిపించారు. అంటే ప్రభాస్ ఈ సినిమాలో యాక్షన్​ మోడ్​లో కాకుండా కూల్​గా, కామెడీ టైమింగ్​తో అలరించనున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు మారుతి సినిమా అంటే మినిమమ్ కామెడీ ఎక్స్​పెక్ట్ చేయవచ్చు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందట. ప్రభాస్​కు జోడీగా నటించనున్న హీరోయిన్ ఇంకా కన్ఫార్మ్ కాలేదు. అలాగే ఇతర నటీనటుల వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు సహా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ఇండియా లెవెల్​లో ఈ సినిమా రూపొందుతోంది.

Prabhas Kalki 2898 AD:మరోవైపు డార్లింగ్ నాగ్​ అశ్విన్​ డైరెక్షన్​లో 'కల్కి 2898 AD' షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2024 మే 9న వరల్డ్​వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కానున్నట్లు రీసెంట్​గా మేకర్స్ ప్రకటించారు. కాగా, సైన్స్ ఫిక్షన్ జానర్​లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్​పై అశ్వనీ దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

'రాజా డీలక్స్' టైటిల్ ఛేంజ్!- కారణం ఇదే

ప్రభాస్​ 'కల్కి' - అఫీషియల్​ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్​

Last Updated : Jan 15, 2024, 7:40 AM IST

ABOUT THE AUTHOR

...view details